Mahesh Babu- Trivikram: ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలలో బాక్స్ ఆఫీస్ పరంగా ఎక్కువ రికార్డ్స్ ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..ఆయన యావరేజి సినిమాలు సైతం వంద కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యడం మన అందరం చూసాము..అలాంటి కెరీర్ పీక్ ఫామ్ లో ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu- Trivikram
ఈమధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది..అతడు మరియు ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై హైప్ మామూలు రేంజ్ లో లేదు..దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అప్పుడే ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి..థియేట్రికల్ కాకుండా నాన్ థియేట్రికల్ బిజినెస్ అప్పుడే మొదలైంది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్స్ కి కొనుగోలు చేసింది..చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 80 కోట్ల రూపాయిలు పలికిందట..మేకర్స్ కూడా ఈ డీల్ కి ఒప్పుకున్నారు..సినిమా థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యాలని ఒప్పందం పెట్టుకున్నారు..ఇక థియేట్రికల్ రైట్స్ కి కూడా మామూలు డిమాండ్ లేదు.

Mahesh Babu- Trivikram
కేవలం నైజాం ప్రాంతానికే 45 కోట్ల రూపాయిలు అడుగుతున్నాడట ఆ చిత్ర నిర్మాత నాగవంశీ..ఇక ఆంధ్ర ప్రదేశ్ , ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు..ఓవరాల్ గా ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిసినెస్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో జరగబోతుందో అనేది.