Pawan Kalyan OG Movie: అక్షరాలా 250 కోట్ల రూపాయిలు.. OG చిత్రం తో ఎవ్వరూ అందుకోలేని రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్
ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అక్షరాలా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం.కేవలం రీజనల్ మార్కెట్ ఉన్న పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం #OG. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాపై క్రేజ్ మార్కెట్ లో మామూలు రేంజ్ లో లేదు. ఇప్పటికీ ఈ చిత్రం నుండి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకి రాకపోయినా బిజినెస్ పరంగా మాత్రం అప్పుడే కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది.
ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అక్షరాలా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం.కేవలం రీజనల్ మార్కెట్ ఉన్న పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగబోతుందని సమాచారం.
ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ అని పిలవబడే డిజిటల్ + సాటిలైట్ రైట్స్ 250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఒక్క ప్రభాస్ కి తప్ప ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా జరగలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ కి తప్ప అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో నవంబర్ లోపు పూర్తి చేసి, డిసెంబర్ 22 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల చేయబోతున్నారని సమాచారం.
ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య డిసెంబర్ లో విడుదల చెయ్యబోతున్నాము, అడ్వాన్స్ లు రెడీ చేసుకోండి అని ఒక సమాచారం అందించాడట. అంటే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుండి ‘బ్రో’ తో పాటుగా ‘OG’ చిత్రం కూడా వస్తుంది అన్నమాట. ఇలా ఒకే ఏడాది రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల అవ్వడం జరిగి చాలా కాలమే అయ్యింది.
