
Tips For Romance: పురుషులకు శృంగారమంటే ఆసక్తి ఎక్కువ. ఏ పనిలో ఉండని శ్రద్ధ అందులో ఉంటుంది. దీంతో వారు ఎంతో ఉత్సుకత వ్యక్తం చేస్తారు. జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక నిమిషంలోనే స్కలనం అయిపోవడంతో నిరాశ చెందుతుంటారు. కానీ అంత సేపు మాత్రం ఏదో సాధించేందుకు ముందుకు వెళ్లినట్లు వెళతారు. మగవారిలో నిరాశ, నిస్ర్పహ వంటి భావనలు దాంపత్యంపై ప్రభావం చూపుతాయి. శీఘ్ర స్కలన సమస్యతో వేదనకు గురవుతారు. శృంగారంలో భావప్రాప్తి కలగాలంటే కొంత సమయం ఉండాలి.
మొదటిసారి శృంగారంలో పాల్గొనే వారికి కొంత గందరగోళం ఉంటుంది,. ఒత్తిడికి గురయితే త్వరగా స్కలనం జరుగుతుంది. దీంతో క్లైమాక్సుకు చేరకుండానే పని ముగిసిపోతుంది. ఫలితంగా చిరాకు కలుగుతుంది. మొదటి అనుభవం తరువాత కూడా అదే తీరుగా ఉంటే జీవిత భాగస్వామికి ఆందోళన ఉంటుంది. మగవారికి కూడా భావప్రాప్తి కలగడం లేదనే వేదన ఎదురవుతుంది. ఒత్తిడితో శృంగార జీవితం సాఫీగా సాగదు. శృంగారం విషయంలో అపోహలు, భయాలు పెట్టుకుంటే సజావుగా సాగదు.
శీఘ్ర స్కలన సమస్య వల్ల భార్యను సంతృప్తి పరచలేకపోయామనే భావన కలుగుతుంది. ఈ సమస్య నుంచి దూరం కావాలంటే కొన్ని చిట్కాలు ఉంటాయి. వీర్యం పడుతుందనే భావన కలగగానే అంగం బయటకు తీసి కాసేపు ఉంచుకోవాలి. తరువాత మళ్లీ అంగం యోనిలో పెట్టాలి. ఇలా కొన్ని సార్లు చేయడం వల్ల శీఘ్ర స్కలన సమస్య లేకుండా పోతుంది. రెండో పద్ధతిలో వీర్యం బయటకు వస్తుందనగనే కొద్దిసేపు కదలికలు ఆపి తరువాత మళ్లీ కంటిన్యూ చేయడం. ఇలాంటి పద్ధతుల వల్ల శీఘ్ర స్కలన సమస్య లేకుండా పోతుంది.

ఇలా ఈ పద్ధతులు పాటించి శీఘ్ర స్కలన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అనవసరంగా గాబరా పడకుండా ఆందోళన చెందకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఫలితం ఉంటుంది. శృంగారంలో భావప్రాప్తి పొందే వీలుంటుంది. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. మొత్తానికి ఇలా శృంగారంలో మంచి సామర్థ్యం చూపించి జీవిత భాగస్వామిని సంతోష పెట్టేందుకు మార్గం చూసుకోవడం శ్రేయస్కరం.