Flight Journey: విమానాల్లో ఒక్కసారైనా ప్రయాణించాలి అని అందరికీ ఉంటుంది. ఎందుకంటే విమానంలో ప్రయాణిస్తుంటే వచ్చే ఎంజాయ్ మెంట్ వేరే. అందుకే అందరూ ఈ జర్నీని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మనకు తెలిసనంత వరకు విమానాల్లో ఇచ్చే ఆహారం అంత టేస్టీగా ఉండదు. మరి ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి విమానాల్లో కూడా భూమ్మీద పెట్టే ఆహారాన్నే వడ్దిస్తారు.

కానీ విమానాలు చాలా ఎత్తున ఎగుతుంటాయి. పైన ఆకాశంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. దాదాపు 35వేల ఎత్తున ఎగురుతున్న క్రమంలో.. విమానాల్లో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మార్పు చేసేందుకు ప్రెజర్‌లో మార్పులు చేస్తుంటారు. అంటే విమానంలో ఎక్కువగా పొడిగాలులు ఉంటాయన్నమాట. పొడిగాలి వల్ల ముక్కులోని నాళాలు, నాలుక మొత్తం పొడిబారిపోతుంది. దీని వల్ల నాలుక మీద ఉండే కణాలు పొడిబారి టేస్ట్ ఏర్పడదు.
Also Read: మంత్రి మేకపాటి మరణంపై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు ఏం జరిగింది?
అంతే కాకుండా ఆక్సిజన్ లెవల్స్ కూడా తక్కువగా ఉంటాయి. దీని వల్ల ముక్కులో ఉండే ఆల్ ఫ్యాక్టరీ రిఫక్టబుల్ అనే స్మెల్‌ను గ్రహించే అవయవం సరిగ్గా పనిచేయదు. దీనివల్ల మన ముక్కుకు సరైన స్మెల్ ఏర్పడదు. వాస్తవానికి మనకు స్మెల్ రాకపోతే రుచి కూడా ఏర్పడదు. అందుకే మనకు జలుబు చేసినప్పుడు రుచి ఏర్పడదు.

దాంతో పాటు విమానాల్లో ఉండే ఇంజిన్ చాలా ఎక్కువగా శబ్దం చేస్తుంది. సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం.. ఎక్కువ సౌండ్ వచ్చే చోట రుచిని గ్రహించే అవయవాల మీద 15 నుంచి 20శాతం ప్రభావం ఉంటుంది. అందుకే తక్కువ సౌండ్ మధ్య తినే వారికి రుచి బాగా ఏర్పడుతుంది. అందుకే విమానాల్లో ఇచ్చే ఆహారంలో ఎక్కువగా ఉప్పు, కారం లాంటివి వేస్తారు. అయినా కూడా పైన చెప్పిన కారణాల వల్ల టేస్టీగా ఉండదు. అంతే గానీ వారు రుచిగా వండలేక కాదు.
Also Read: ‘భీమ్లానాయక్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ ఫిక్స్
Recommended Video: