Site icon OkTelugu

UPSC Topper Ishita Kishore: సివిల్స్‌ టాప్ ర్యాంకర్ హైదరాబాదీనే.. ఆమె పుట్టింది ఇక్కడే.. ఆ కథేంటో తెలుసా?

UPSC Topper Ishita Kishore

UPSC Topper Ishita Kishore

UPSC Topper Ishita Kishore: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) మంగళవారం సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022 తుది ఫలితాలను ప్రకటించింది. సివిల్స్‌–2022లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలిచారు. దీంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. అయితే సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన ఇషితకు హైదరాబాద్‌తో సంబంధం ఉంది.

సొంత రాష్ట్రం బిహార్‌.. పుట్టింది హైదరాబాద్‌..
సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన ఇషిత హైదరాబాద్‌లోని బేగంపేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులది బిహార్‌. ఫలితాలు వచ్చిన తర్వాత ఇషిత మాట్లాడుతూ ‘‘నేను హైదరాబాద్‌తో కనెక్ట్‌ అయ్యాను. నిజానికి నేను అక్కడి బేగంపేటలో జన్మించాను.. ఐఏఎఫ్‌ అధికారి అయిన మా నాన్నలా దేశానికి సేవ చేయాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. నేను పాలనలో ఎక్కువ భాగం కావాలనుకుంటున్నాను. అందుకే నేను ఐఏఎస్‌ని ఎంచుకున్నాను. సివిల్‌ సర్వీసెస్‌ చాలా అవకాశాలను ఇస్తుంది’ అని ఇషిత ఆనందంలో మునిగిపోయారు.

ప్రస్తుతం యూపీలో..
బీహార్‌కు చెందిన ఇషిత.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్నారు. ఆమె క్యాడర్‌లో తన మొదటి ప్రాధాన్యతగా ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌)ని ఎంచుకుని.. దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

తల్లిదండ్రుల నేపథ్యం..
ఇషిత తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కాగా, తల్లి రిటైర్డ్‌ టీచర్‌.. వారి నుంచి ప్రేరణ పొందడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే అభిరుచి ఇషితను సివిల్‌ సర్వీసెస్‌ చేపట్టేలా చేసింది. ఇషిత ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి కూడా. ఇషితా కిషోర్‌ ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్‌. ఆమె 2017లో ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. దీని తర్వాత, ఆమె రిస్క్‌ అడ్వైజరీలో ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌తో కలిసి పనిచేశారు.

Exit mobile version