Homeలైఫ్ స్టైల్World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా... ప్రత్యేక కథనం

World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా… ప్రత్యేక కథనం

World Blood Donor Day: హైదరాబాద్ , జూన్ 14: భారతదేశంలో 41మిలియన్ యూనిట్ల రక్తం కొరత ఉంది. అంతేకాదు దేశంలో ప్రతి సంవత్సరం కేవలం1 శాతం మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ పై చాలా మంది ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుతున్నారు. రక్త దానం ఆవశ్యకత పై అవగాహన పెంపొందించడం, జాతీయ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసే రక్తదాతల పాత్రపై సామాన్యులకు అవగాహన కల్పించడం, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం పలు ప్రచార కార్యక్రమాలను చేపడుతూ బ్లడ్ బాంక్ లను ప్రోత్సహిస్తున్నారు. ‘రక్తదానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి’ అన్నది ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్. స్వచ్ఛంద రక్తదానం ప్రాణాలను కాపాడడంలో సమాజంలో సంఘీభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తాన్నికృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు, కాబట్టి బ్లడ్ ను దాత నుంచి మాత్రమే సేకరించాలి. మన దేశంలో ప్రతిరోజూ 12వేలమందికి పైగా పలు ప్రమాదాలలో లేదా డెలివరీ సమయంలో చనిపోవడం దురదృష్టకరం, దేశవ్యాప్తంగా రక్తం సిద్ధంగా ఉన్నప్పటికీ దానిని బాధితులకు వెంటనే రక్తాన్ని ఎక్కించలేకపోవడమే అందుకు కారణం .

 World Blood Donor Day
Blood Donor Day

గర్భందాల్చిన మహిళలు, ప్రసవ సమయంలో రక్తస్రావంతో బాధపడు తున్న మహిళలు, మలేరియా,పోషకాహార లోపం కారణంగా తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, రక్తం లేదా ఎముక మజ్జ, హిమోగ్లోబిన్ ,రోగనిరోధక వ్యవస్థ లోపాలు ఉన్నవారికి రక్తంచాలా అవసరం. అత్యవసర పరిస్థితులు, గాయాలైన బాధితులు,శస్త్రచికిత్స చేయించుకునే వారికి బ్లడ్ అనేది చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 800 మంది మహిళలు గర్భం లేదా ప్రసవ సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. ఈ మరణాలు చాలా వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఎక్కువగా సంభవిస్తు న్నాయి. ప్రసూతి మరణాలు15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కౌమార బాలికలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో రక్తం కొరత తీవ్రంగా ఉంది. రక్తం దానం చేసేందుకు విద్యార్ధులతోపాటు, అర్హత ఉన్నవారంతా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు రక్త కొరతతో బాధపడుతున్నాయి. అవసరమైన వారికోసం సురక్షితమైన రక్తాన్నిసేకరించడం,నిల్వ చేయడం, సరఫరా చేయడం కోసం పలు స్వచ్చంద సంస్థలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పలు సంస్థలు రక్తదానానికి సంబంధించి సమాచారం అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్లు, ఆప్ లు అందుబాటులో ఉంచుతున్నాయి. http://donor2donor.com/, Friends2Support.org

 World Blood Donor Day
World Blood Donor Day

భయాలు-అపోహలు…

18ఏళ్ళు దాటి 40కేజీలకు పైగా బరుఉండి..ఆరోగ్యవంతులు ఎవరైనా సరే ఎలాంటి సందేహం లేకుండా రక్త దానం చేయవచ్చు. రక్తదానం ఆరోగ్యంపై ఆటంకం కలిగిస్తుంది లేదా శరీరంలో రక్త లోటును కలిగిస్తుందనేది కేవలం అపోహామాత్రమే. రక్త దానం అంటువ్యాధులకు దారితీస్తుందనేది నిజం కాదు. వాస్తవానికి రక్తదానం శరీరంలో అదనపు ఐరన్ ను నిరోధిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలను రావు.
మానవ శరీరం సగటున 5-6 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది, కొత్త రక్తాన్ని ఏర్పరచడం అనేది నిరంతర ప్రక్రియ, తద్వారా ఏ సమయంలోనైనా దానిలో పదో వంతు అంటే 350-450 ml డొనేట్ చేయవచ్చు. దానం చేసిన రక్తం 48 గంటల్లో మళ్ళీ తయారవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారెవరైనా మూడు నెలలకు ఓసారి సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన తర్వాత వెంటనే తమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగించవచ్చు. 24 గంటలలోపు10 -12 గ్లాసుల నీరు తాగాలి, బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు గంటలపాటు డ్రైవింగ్ చేయడం, ధూమపానం చేయకూడదు. ఎండలో తిరగకూడదు. రెండు రోజులు వరకు మద్యానికి దూరంగా ఉండాలి.

 World Blood Donor Day
World Blood Donor Day
admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular