https://oktelugu.com/

Under 10 Lakh Cars: రూ.10 లక్షలలోపు బెస్ట్ ఫీచర్స్ కలిగిన 5 కార్లు ఇవే..

టాటా పంచ్: టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయినా పంచ్ ఎస్ యూవీ కేటగిరీల్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్, 88 హెచ్ పీ ఇంజిన్ తో 5 ఎంటీ, 5 ఏఎంటీ ని కలిగి ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2023 10:04 am
    Under 10 Lakh Cars

    Under 10 Lakh Cars

    Follow us on

    Under 10 Lakh Cars: కార్ల వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కానీ తక్కువ ధరలో వచ్చే వాటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరలు బెస్ట్ ఫీచర్స్ ఉండేలా తయారు చేస్తున్నాయి. ఇలాంటి కార్లకు డిమాండ్ బాగా ఏర్పడుతుంది. తాజాగా రోడ్లపై తిరుగుతున్న 5 మోడళ్లు రూ.10 లక్షలలోపే లభిస్తున్నాయి. అంతేకాకుండా మంచి ఫీచర్స్ తో అలరిస్తున్నాయి. మరి ఆ కార్లు ఏవో తెలుసుకుందామా.

    టాటా పంచ్: టాటా కంపెనీ నుంచి రిలీజ్ అయినా పంచ్ ఎస్ యూవీ కేటగిరీల్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్, 88 హెచ్ పీ ఇంజిన్ తో 5 ఎంటీ, 5 ఏఎంటీ ని కలిగి ఉంది. దీని ధర రూ.7.50 లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు విక్రయిస్తన్నారు. దేశీయ మార్కెట్లలో దూసుకుపోతున్న హ్యుందాయ్ ఎక్స్ టర్ బెస్ట్ మోడల్ గా పేరు తెచ్చుకుంటోంది. ఈ మోడల్ ఫీచర్స్ విషయానికొస్తే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ లో లభిస్తుంది. ఇందులో 5 స్పీడ్ ఏఎంటీ వేరియంట్ ను కలిగి ఉంది. దీనిని రూ.7.97 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.

    రెనాల్డ్ నుంచి కూడా తక్కువ ధరలో కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ కంపెనీ నుంచి కైగర్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 5-స్పీడ్ ఏఎంటీ వెర్షన్లో రూ.8.47 లక్షల నుంచే విక్రయిస్తున్నారు. అయితే ఇందులో సీవీటి వేరియంట్ మాత్రం రూ.11 లక్షలు ఉంది. దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకీ నుంచి ఫ్రాన్క్స్ రూ.8.8 లక్షల నుంచి విక్రయిస్తున్నారు. ఇందులో రెండు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు 5 ఏఎంటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ను కలిగి ఉంది.

    టాటా కంపెనీ నుంచి నెక్సాన్ రూ.9.65 లక్షల ప్రారంభ ధర ఉంది. ఇందులోనూ రెండు ఇంజన్ ఆప్షన్లతో ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ను కలిగి ఉంది. ఇది సెప్టెంబర్ 14న లాంచ్ చేశారు. వినియోగదారులు రూ.10 లక్షలలోపు కొనుగోలు చేయాలనుకుంటే ఇవి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. అంతేకాకుండా ఎస్ యూవీ వేరియంట్ లోబెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉండడంతో వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు