Memory Loss: భాసూ… మనకి మెమొరీ లాసూ

సాధారణంగా మన మెదడు అనేది మెమరీ కార్డు లాంటిది. అతి ప్రతిక్షణం మన శరీరానికి ప్రోగ్రామింగ్ అందిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పని చేయగలుగుతాం. జ్ఞాపకాల దగ్గర నుంచి మొదలుపెడితే అనుభూతుల వరకు ప్రతిదీ అదుపు అదుపాజ్ఞలోనే జరుగుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 26, 2023 5:12 pm
Follow us on

Memory Loss: కిక్ సినిమా చూశారా.. అందులో రవితేజ గతం మర్చిపోయిన వ్యక్తి లాగ నటిస్తూ ఉంటాడు. అది మనకు కామెడీని పంచవచ్చుగానీ.. నిజ జీవితంలో మాత్రం అలా ఉంటే చాలా కష్టం. ప్రస్తుత సాంకేతిక యుగంలో అందరి పరిస్థితి కూడా అలానే మారిపోయింది. కనీసం చిన్నచిన్న విషయాలు కూడా గుర్తు ఉండడం లేదు. నోటితో చెప్పాల్సిన లెక్కలను కూడా ఉపయోగించి చేస్తున్నాం. దీనివల్ల మెదడు పనిచేసే స్వభావాన్ని కోల్పోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా మతిమరుపుతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోందని వారు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గజినీలుగా మారిపోతారని ఆవేదన చెందుతున్నారు.

సాధారణంగా మన మెదడు అనేది మెమరీ కార్డు లాంటిది. అతి ప్రతిక్షణం మన శరీరానికి ప్రోగ్రామింగ్ అందిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పని చేయగలుగుతాం. జ్ఞాపకాల దగ్గర నుంచి మొదలుపెడితే అనుభూతుల వరకు ప్రతిదీ అదుపు అదుపాజ్ఞలోనే జరుగుతుంది. అయితే సహజంగానే మెదడుకు సొంతంగా పనిచేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణం ఆధారంగానే ఒక మనిషి మేథో సంపత్తిని అంచనా వేయవచ్చు. అయితే ఈ మేథో సంపత్తి కాస్త పక్క దారి పడితేనే అసలు సమస్య మొదలవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. దానివల్లే మెదడు సంబంధిత రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్నది. తలనొప్పి, తలలో ఒక పార్శ్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టడం, అకస్మాత్తుగా పెరిగే బీపీ, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం, అకారణంగా ఎదుటివారితో గొడవ పడటం వాటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. ఇంకా కొందరైతే ప్రతి చిన్న విషయాన్ని కూడా స్మార్ట్ ఫోన్ లో వర్డ్ నోట్ లో రాసుకుంటున్నారు. దాని ఆధారంగానే తమ దినచర్యను ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి ఒక కొంత వయసు వచ్చిన తర్వాత మెదడు అనేది అంత ప్రభావశీలంగా పనిచేయదు. కానీ అంతటి వయసు రాకుండా పనిచేయడం తగ్గిపోతోంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధ లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత అది మనిషి మెదడు పనితీరు మీద మరింత ప్రభావం చూపిస్తోంది.

ముందుగానే మనం చెప్పినట్టు మెదడు ఎంత ప్రభావశీలంగా పనిచేస్తే మనిషి అంత బాగుంటాడు. మాయ దారి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవితంలో క్రమేపి మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న పనికి కూడా క్యాలిక్యులేటర్ లేదా స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడడం పెరిగిపోయింది. ఫలితంగా జ్ఞాపకశక్తి క్రమేపి తగ్గుతోంది. ఇది అంతర్లీనంగా ఇతర రోగాలు రావడానికి కారణం అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా న్యూరో సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ కు అదే పనిగా బానిస కావడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు ఉండడం లేదు. దీనికి తోడు హృదయ సంబంధిత వ్యాధులు వెలుగుచూస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఆధారపడటం వల్ల మెదడు మొద్దు బారిపోతోంది. పెద్దల పరిస్థితి ఇలా ఉంటే.. స్మార్ట్ చదువుల ప్రభావం వల్ల పిల్లలు కూడా మేథో సంపత్తిని కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అతిగా స్పందిస్తున్నారు. నలుగురితో కలిసి ఉండలేకపోతున్నారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడటం వల్ల చురుకుదనాన్ని కోల్పోతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే గజినీ లో సూర్య లాగా ఒంటి చుట్టూ పచ్చ బొట్లు, ఫోటోలు తీసుకోవాల్సి వస్తుందనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు.