https://oktelugu.com/

Mental Health:మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

నసికంగా మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో.. అప్పుడే లైఫ్‌లో ఎలాంటి సమస్యను అయిన కూడా డీల్ చేయగలరు. అయితే కొందరు తెలిసో, తెలియక మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2024 / 03:14 AM IST

    mental-health

    Follow us on

    Mental Health: భూమి మీద ఉన్న మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మానసికంగా సంతోషంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్‌లో ఉండి చాలా మంది ఎక్కువగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోకుండా, వర్క్ బిజీలో ఆందోళనకు గురి అయ్యి చివరకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఇలా చివరికి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి బయటకు రావాలని కొందరు ప్రయత్నిస్తే.. మరికొందరు అసలు పట్టించుకోరు. మానసిక ఆరోగ్యం ఏం కాదులే అని లైట్ తీసుకుంటున్నారు. ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మానసికంగా మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో.. అప్పుడే లైఫ్‌లో ఎలాంటి సమస్యను అయిన కూడా డీల్ చేయగలరు. అయితే కొందరు తెలిసో, తెలియక మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    మానసిక సమస్యలతో ఎక్కువగా యంగ్ ఏజ్‌లో ఉన్నవారే బాధపడుతున్నారు. కేవలం ఇండియాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా బాధ పడితే వాటిని క్లియర్ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా తీవ్ర ఆవేదన చెందితే ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ పనులు కూడా మీరు చేసుకోలేరు. అన్ని పనులకు ఇతరుల మీద ఆధార పడాల్సి వస్తుందట. ఓ మహిళ వ్యక్తిగత కారణాల వల్ల మానసిక సమస్యలతో ఎంతో ఇబ్బంది పడిందట. వీటిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్, ఫుడ్ వంటివి తీసుకోలేదు. దీంతో ఆమెకు సమస్య తీవ్రం అయి చివరకు మంచాన పడాల్సి వచ్చింది. కనీసం ఫుడ్ తినలేరు. వాష్ రూమ్‌కి వెళ్లలేరు. అన్నింటికి ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది. మానసికంగా బాగా బాధపడితే మెదడు దెబ్బతింటుంది. దీంతో పనిచేయక ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదు. కాబట్టి ఎక్కువగా ఏ విషయానికి కూడా ఒత్తిడికి లోనుకావద్దు.

    చిన్న విషయాలకు ఒత్తిడికి గురై, బాగా ఆందోళన చెందితే ఇలాంటి సమస్యలే వస్తాయి. కాబట్టి ఏ విషయానికి టెన్షన్ పడాలి? దేనికి పడకూడదని తెలుసుకోండి. ఇంట్లో పనులు, వ్యక్తిగత పనులు అన్ని ఉంటాయి. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా యోగా, మెడిటేషన్ వంటివి చేయండి. వీటిని చేయడం వల్ల కాస్త ఫ్రీ అయ్యి టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు మెదడుని రిఫ్రెష్ చేయండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఖాళీగా ఒకే దగ్గర ఒంటరిగా కూర్చోని బాధ పడకుండా అందరితో కలవడం, మాట్లాడం, వాకింగ్, జాకింగ్ వంటివి చేస్తుండాలి. ఇలాంటివి చేయడం వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.