Gold Price Reduced: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పడిపోతున్నాయి. మే 5న బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకోగా.. ఆ తరువాత రోజు నుంచి తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.1000కి తగ్గింది. 2022 నవంబర్ లో రూ. 46,100 ఉండగా.. ఆ తరువాత రూ.50 వేలు.. అక్కడి నుంచి రూ.61 వేల వరకు చేరుకుంది. ఒక దశలో లక్ష రూపాయల మార్క్ చేరుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ గత 10 రోజులుగా వరుసగా ధరలు తగ్గుతూ రావడంతో బులియన్ మార్కెట్లో తీవ్ర చర్చ సాగుతోంది. రెండు నెలలుగా మంచిరోజులు ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నారు. దీంతో పసిడి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కానీ ధరలు తగ్గడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
శుక్రవారం నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలను చూస్తే బాగా తగ్గినట్లు తెలుస్తోంది. ఈరోజున 10 గ్రాముల బంగారం ధ రూ.56,100 నుంచి రూ.55,800 ఉంది. స్వచ్ఛమైన బంగారం ధర రూ.61,000 మార్క్ దిగువకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే రూ.300 తగ్గింది. వెండి సైతం అదే స్థాయిలో పతనమవుతోంది. కిలో వెండి రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.78,100 నుంచి 78 వేలకు పలుకుతోంది. తులం ప్రకారం చూస్తే రూ.780కి విక్రయిస్తున్నారు.
గత ఆరు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 2022 నవంబర్ 4న 22 క్యారెట్ల బంగారం రూ.46,100 గా నమోదైంది. ప్రస్తుతం రూ.55,800. అంటే ఆరు నెలల్లో రూ.9,000 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే ఈ కాలంలో రూ.18000 పెరగడం విశేషం. ఇలా మే నెల 5 వరకు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ మే 6 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ 10 రోజుల్లో మొత్తం రూ.1000 తగ్గగా.. వెండి రూ.5,600 తగ్గడం విశేషం.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనం కావడంతోనే ఆ ప్రభావం మనదేశ కమెడిటీ ధరల్లో మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1962 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి 24 డాలర్ల దిగువకు చేరి ప్రస్తుతం 23.78 డాలర్లకు చేరుకుంది. అయితే ఈ ధరలు మరింత పతనం అవుతాయా? అనేది చూడాల్సి ఉంది.