IPL 2022: మన దేశలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పొట్టి ఫార్మాట్ కు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతున్నసంగతి తెలిసిందే. దీనికోసం భారత్ లో క్రికెట్ అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. అయితే ప్రతి సీజన్ లో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫెమస్ అవుతారు. ఈ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో స్టేడియంలో చుట్టూ ఉండేవాళ్లల్లో కొంతమంది అనూహ్యంగా ఫేమస్ అయిపోతూ ఉంటారు. అమ్మాయిలైతే తమ ఫెవరెట్ ఆటగాడు ఓ షాట్ కొట్టగానే గాల్లో ముద్దులు పెడుతూ రచ్చ చేస్తుంటారు. కొంత మంది వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనమిస్తుంటారు. మరికొందరు టాటూస్.. హెయిర్ స్టైల్ ఇలా కనబడుతుంటారు.

ఇటీవలే ఓ యువ జంట మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ముద్దు పెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఓ బ్యూటీ కూడా కెమెరా కంటికి చిక్కి యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Also Read: Mumbai Indians IPL 2022: ఐదు సార్లు చాంపియనే.. అయినా చెత్త రికార్డే..
ఈ ధనాధన్ లీగ్ లో అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడి కుర్రకారు మనసులు కొల్లగొడుతున్నారు. అలా టోర్నీలో ఇప్పటివరకు ఒక్కచూపుతోనే సోషల్మీడియాలో ట్రెండ్ అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా ఒక మిస్టరీ గర్ల్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.

మిస్టరీ గర్ల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కెమెరామెన్ ను ఆటాడుకున్నారు నెటిజన్లు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మిస్టరీ గర్ల్స్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు వైరల్ అయ్యారు. కానీ, ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచుల్లో మాత్రం ఓ ముద్దుగుమ్మ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో, ఈ బ్యూటీ ఎవరనీ నెటిజన్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారు.

సీఎస్కే ఫ్యాన్ గర్ల్ గా వైరల్ అయిన మిస్టరీ అమ్మాయి పేరు దేవికా నాయర్. దేవికా స్వయంగా తన వైరల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దేవికా ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్. దేవిక ఫోటో వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దేవికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 22,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Also Read:Samantha on Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ పై యుద్ధం ప్రకటించిన సమంత.. షాక్ లో ఫాన్స్