Site icon OkTelugu

Ice Cream Health Effects: Ice cream ను లొట్టలేసుకొని తింటున్నారా.. ఈ విషయం మీకు తెలుసా..

Ice Cream Health Effects

Ice Cream Health Effects

Ice Cream Health Effects: ఎండాకాలంలో చాలామంది ఐస్ క్రీం తినేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే బయట వాతావరణం లో వేడి అధికంగా ఉంటుంది. దాహం కూడా అధికంగా వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడానికి చాలామంది ఐస్క్రీం ను ఆశ్రయిస్తుంటారు. ఒకప్పుడు పుల్ల ఐస్ మాత్రమే అందుబాటులో ఉండేది. కాలం మారిన తర్వాత ఐస్ క్రీమ్ లో అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. వెనిలా, స్ట్రాబెరీ, చాక్లెట్, ఆల్మండ్.. స్మూతీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు..

ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలామంది ముందు వెనక ఆలోచించరు. కేవలం తినడానికి మాత్రమే ఆసక్తిని చూపిస్తుంటారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలామంది ఐస్క్రీమ్ ల మీద డిస్కౌంట్ ప్రకటిస్తుంటారు. డిస్కౌంట్ ఉంది కదా అని చాలామంది ఆ షాపుల్లోకి వెళ్లి.. దండిగా తినోస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఐస్ క్రీమ్ ల పై డిస్కౌంట్ అంటేనే పెద్ద మోసం. ఎందుకంటే చాలామంది డిస్కౌంట్ పేరుతో ఐస్క్రీం అన్నారు. ఫ్రోజెన్ డిజర్ట్ ను ఐస్ క్రీమ్ మాదిరిగా మార్చి అమ్ముతుంటారు. ఇలాంటప్పుడు కస్టమర్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఐస్ క్రీమ్ ను పాలతో తయారుచేస్తారు. కనీసం 10% మిల్క్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఐస్ క్రీమ్ ప్యాకెట్ డబ్బా మీద.. ఐస్క్రీమ్ అని స్పష్టంగా రాసి ఉంటుంది.. ఫ్రోజెన్ డిజర్ట్ లో పామాయిల్, హైడ్రో జనరేటెడ్ ఆయిల్ వాడుతుంటారు. ఇది ఐస్ క్రీమ్ తో పోల్చి చూస్తే ధర తక్కువగా ఉంటుంది.

పేరుపొందిన బ్రాండ్ల ఐస్ క్రీమ్ ల ధర అధికంగా ఉంటుంది. పైగా వాటిల్లో రకరకాల ప్లేవర్లు అందుబాటులో ఉంటాయి. అవి రుచికి చాలా బాగుంటాయి. కానీ కొన్ని కంపెనీలు ఎక్కువ లాభాల కోసం ఐస్ క్రీమ్ కాకుండా … ఫ్రోజెన్ డిజర్ట్ తయారు చేస్తుంటాయి. వాటిల్లో ప్రమాదకరమైన పదార్థాలను వాడుతూ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కాదు. డిస్కౌంట్ వస్తుందని చెప్పి వీటిని అదే పనిగా తింటే రకరకాల సమస్యలు వస్తుంటాయి. అందువల్ల అటువంటి వాటిని తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

“ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు పాలను వాడుతారు. అందులో రకరకాల పదార్థాలను కూడా ఉపయోగిస్తారు. అవన్నీ కూడా చాలా ఖరీదైనవి. అందువల్లే పేరు పొందిన బ్రాండ్ కంపెనీలు ధర ఎక్కువకు తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటాయి. కానీ కొన్ని కంపెనీలు అసలుకు నకిలీ లాగా ఉత్పత్తులను తయారుచేస్తాయి. ఇందులో ప్రమాదకరమైన పదార్థాలను వాడతాయి. అటువంటి వాటిని ఐస్క్రీమ్ అని కొంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఎండాకాలంలో ఐస్క్రీం తింటున్నప్పుడు.. ఐస్ క్రీమ్ కొనుగోలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని” వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version