Diabetes Symptoms In Kids: మారుతున్న జీవన శైలి కారణంగా ప్రతి మనిషికీ అనారోగ్య సమస్య ఎదురవుతూనే ఉంది. మనం తీసుకునే ఆహారం కారణంగా కాలుష్యం కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు వయసు తేడా కూడా లేకుండా పోతోంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య డయాబెటీస్. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు.

అయితే కొంత మంది పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకడం అందరినీ కలవర పాటుకి గురి చేస్తుంది. ఇప్పుడు మనం పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ ఎలా ఉంటుంది, దానిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. డయాబెటీస్ మూడు రకాలు.. టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటీస్. ఇందులో టైప్ 1 డయాబెటీస్ అనేది పిల్లల్లో కనిపిస్తుంది. ఇది వారసత్వం కారణంగా పిల్లల్లో ఎక్కువగా వస్తుంది.
Also Read: పిల్లలకు ఈ ఆహారం తినిపిస్తే ప్రమాదం అట.. జాగ్రత్త
టైప్ 1 డయాబెటీస్ కారణంగా పిల్లల్లో ప్రాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. ఇది ఉత్పత్తి లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీనిని ఎలా గుర్తించాలి అంటే.. పిల్లల్లో బరువు తగ్గడం, విపరీతమైన ఆకలి, అలసట, రాత్రి పూట పక్కతడపడం, దాహం ఎక్కువగా అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలా పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వస్తే వారి ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ గ్లైకామిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తినాలి. లేకపోతే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. రోజుకు 10 నుండి 12 గ్లాసుల నీరు తాగించాలి. ఎక్కువ కూరగాయలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తక్కువ కొవ్వులతో, తక్కువ కార్బోహైడ్రేట్స్ తో ఉన్న భోజనం పెట్టాలి. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించాలి.
Also Read: కర్పూరం పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలుసా?