Site icon OkTelugu

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat, brain health

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకు పోతుంది. ఈ కొవ్వు అవయవాల చుట్టూ ఉండడంతో శరీర ఆకృతి మారడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అయితే ఇటీవల తేలిన కొన్ని నివేదికల ప్రకారం కొవ్వుతో శారీరక సమస్యలు మాత్రమే కాకుండా మెదడుపై కూడా ప్రభావం పడుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మెదడుపై ఎలా ప్రభావం చూపుతోందో చూద్దాం..

మనిషి మెదడులో జ్ఞాపకశక్తి అందించే కీలకమైన భాగాల్లో హిప్పో కాంపస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది మెదడు ఆరోగ్యాన్ని, జీవనశైలి, రక్తనాళాల ఆరోగ్యం, మెటా బాలిక్ సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయితే శరీరంలో అధికంగా కొవ్వు పేరుకు పోతే మెదడుకు రక్తప్రసరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కొవ్వుతో నాడి కణాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది.

కొందరిలో అధిక బరువు వల్ల సాధారణ ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కాగ్నిటివ్ డిక్లైన్, డిమెన్సియా నాకు ప్రమాదాల్లో కూడా చిక్కుకునే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వులో ఇతర మెటబాలిక్ సమస్యలు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుందని చెప్పలేం. కానీ వంశపారపర్యం, వయసు, రక్తపోటుతో పాటు మధుమేహం ఉన్నవారిలో ఈ సమస్య ఉండే అవకాశం ఉంది..

ఈ నేపథ్యంలో పొట్ట చుట్టూ లేదా అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ కొవ్వు పెరగకుండా ఉండాలంటే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. ముఖ్యంగా శీతాల పానీయాలు, ప్రాసెస్ ఫుడ్ తీసుకునే అలవాటును మానుకోవాలి. కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఆరోగ్యపు అలవాట్లు కూడా కొవ్వు పెరగడానికి కారణం అవుతూ ఉంటాయి. వీటిలో నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అధికంగా మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు కూడా బెల్లి ఫ్యాట్ కు కారణం అవుతుంది.

అయితే ఆహారం తీసుకోవడంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్ స్థానంలో శనిగలు, మినుములు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు వంటి వాటిని చేర్చుకోవాలి. ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి కొవ్వును తక్కువగా అందిస్తాయి. వీటితోపాటు ఇప్పటికే కొవ్వు అధికంగా ఉన్నవారు కఠినమైన డైట్ ను పాటించి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి.

Exit mobile version