Gold, Silver Prices: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కొన్నిరోజుల క్రితం వరకు బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రోజుల్లో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరగడం గమనార్హం. బంగారం దారిలోనే వెండి కూడా పయనించగా వెండి ధరలు కూడా పెరిగాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గడం గమనార్హం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే ఏకంగా 160 రూపాయలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 51,760 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా 150 రూపాయలు పెరిగి 47,450 రూపాయలుగా ఉండటం గమనార్హం. కిలో వెండి ధర ఏకంగా 600 రూపాయలు పెరిగింది.
ప్రస్తుతం కిలో వెండి ధర ఏకంగా 72,900 రూపాయలుగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించడంతో 1942 డాలర్లుగా ఉంది. వెండి ధర మాత్రం 0.32 శాతంతగ్గి 25.53 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు భిన్నంగా దేశీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉండటం గమనార్హం. బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇదే చేదువార్తే అని చెప్పాలి.
బంగారం, వెండి ధరలపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలలో వ్యత్యాసం ఉంటుంది. జీఎస్టీ, ఇతర పన్నులు, మేకింగ్ ఛార్జీలు కలిపితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.