Raw Onion Side Effects: పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు తెలుసా?

ఉల్లిపాయ రసం ,చర్మానికి జుట్టుకు ఎంతో మేలు కలిగిస్తుంది. చర్మం మీద పేరుకుపోయిన బ్యాక్టీరియాను తగ్గించి చర్మానికి కాంతి తేవడంలో ఉల్లి రసం సహాయపడుతుంది.

Written By: Vadde, Updated On : September 12, 2023 9:03 am

Raw Onion Side Effects

Follow us on

Raw Onion Side Effects: చాలామంది పచ్చి ఉల్లిపాయలను సలాడ్, నూడుల్స్, చికెన్ ఫ్రై లాంటి ఆహారాలకు తీసుకుంటారు. అలాగే కొంతమంది మజ్జిగ అన్నం లో తినడానికి ఇష్టపడతారు. చాలామంది పెరుగులో సన్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటారు. ఇలా ఏ రూపంలో తిన్న ఉల్లిపాయ శరీరానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల మన శరీరంలో ఉత్పన్నమయ్యే పలు రకాల అనారోగ్య సమస్యలు నివారించబడతాయి.

ఉల్లిపాయ రసం ,చర్మానికి జుట్టుకు ఎంతో మేలు కలిగిస్తుంది. చర్మం మీద పేరుకుపోయిన బ్యాక్టీరియాను తగ్గించి చర్మానికి కాంతి తేవడంలో ఉల్లి రసం సహాయపడుతుంది. చుండ్రుతో బాధపడే వారికి ఉల్లి రసం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా అని ఎక్కువ పచ్చ ఉల్లిపాయ తింటారేమో…..అది కూడా ప్రమాదమే మరి. ఎందుకంటే ఉల్లిపాయల వల్ల కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

ఆఫ్రికన్ హెల్త్ సైన్స్ వాళ్ళు ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం…ఉల్లిపాయలు, ఆస్పరాగస్, లీక్స్…ఇలా లిలియాసి కుటుంబానికి చెందిన కొన్ని రకాల ఆహార పదార్థాలు పచ్చిగా తీసుకోవడం వల్ల అలెర్జీ క్రాస్ రియాక్టివిటీ సంభవిస్తుంది. కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే ఫుడ్ ఎలర్జీ వస్తుంది. ఇలా ఎలర్జీ సింటమ్స్ ఉన్నవారు వీలైనంతవరకు పచ్చి ఉల్లిపాయ తినకూడదు. మరి ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయని వీలైనంతగా అవాయిడ్ చేయడం మంచిది.

పచ్చి ఉల్లిపాయల్లో ఫ్రక్టాన్స్ ఉంటుంది… కాబట్టి గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు మంట కలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఆసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. ఉల్లిపాయల్లో అధిక మోతాదులో సల్ఫర్ ఉంటుంది. కాబట్టి మంచి ఉల్లిపాయ తినడం వలన చాలాసేపటి వరకు నోటిలో దుర్గంధం వస్తుంది. అందుకే ఉల్లిపాయ తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం.ఉల్లిపాయలలో అధిక శాతంలో ఉన్న విటమిన్ కె , రక్తం గడ్డ కట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.