Birthmarks Astrology: జీవితంలో ఉన్నతంగా జీవించడానికి ఎంతో కష్టపడుతుంటాం.. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం.. కానీ అనుకున్న లక్ష్యానికి చేరాలంటే చాలా సమయం పడుతుంది. అయితే కొందరు ఏమాత్రం కష్టపడకుండా.. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే కోటీశ్వరులవుతారు. అందుకు వారికి అదృష్టం కలిసి రావడమే. అదృష్టం అక్కడా.. ఇక్కడా అంటూ ఉండదు. జాతక రీత్యా వారికి కలిసివస్తోంది. కొందరికి పుట్టుకతోనే అదృష్టం వరిస్తే.. మరికొందరికి మధ్యలో లక్ తగులుంది. ఇది ఏ రూపంలోనైనా రావొచ్చు. చివరికి మనం పెళ్లి చేసుకునే అమ్మాయి రూపంలోనూ ఉండొచ్చు. అయితే అమ్మాయిలకు కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉన్నవారిని చేసుకుంటే వారితో పాటు చేసుకున్న వారికి కలిసి వస్తుందట. ఆ విషయాలేవో చూద్దాం.
యువతీ యువకులకు పెళ్లయిన తరువాత కొత్త జీవితం కనిపిస్తుంది. ఈ సమయంలో వారు ఎన్నోఆటంకాలు దాటుతూ వెళ్లాలి. అయితే కొందరికి పెళ్లి చేసుకోగానే అదృష్టం కలిసి వస్తుంది. ఈ అదృష్టాన్ని పుట్టుమచ్చలు తెస్తాయని కొందరు జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. ఆడవారికి కాలి మీద పుట్టుమచ్చ ఉంటే తెలివైన వారుగా ఉంటారట. వీర భర్తకు సహకారంగా ఉంటూ కుటుంబాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెుళ్తారట. ఇలా కాలు మీద పుట్టుమచ్చ ఉన్న యువతి మీ జీవితంలోకి అడుగుపెడితే అన్నీకలిసివస్తాయి.
మోహంపై బొట్టు పెట్టే ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే ఆ అమ్మాయి జీవితం ఎంతో బాగుంటుంది. ధనవంతుడైన అబ్బాయి తన జీవితంలోకి వస్తాడు. భర్తకు కూడా ఆమె ద్వారా కలిసి వస్తుంది. చేతిపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. కంటికింద పుట్టుమచ్చ ఉన్నవాళ్లు తమ అదృష్టాన్ని భర్తకు ఇచ్చినట్లే. పెళ్లి తరువాత వీరిద్దరు ఆనందంగా జీవిస్తారు. వీరి జీవితంలో ఎటువంటి ఆర్టిక పరమైన చిక్కులు రాకుండా ఉంటాయి. పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆమె జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
ఇక బొటన వేలిపై పుట్టుమచ్చ ఉంటే మాత్రం అమ్మాయి సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆమెతో పాటు భర్త కూడా కష్టాలను ఎదుర్కొంటాడు. సాధారణంగా బొటనవేలుపై పుట్టుమచ్చ ఎవరికీ ఉండదు. కానీ ఉన్నవారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అయితే వీటి పరిహారం కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తే సమస్యకు పరిష్కారం చూపుతారు. ఇక నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న వాళ్ల భర్తలు అదృష్టవంతులుగా ఉంటారు.