Chanakya Niti: భార్య భర్తల బంధం ఎంతో గొప్ప బంధం. పెళ్లి అనే బంధం తో అందరిని వదిలేసి అత్తగారింటికి వచ్చి తల్లిదండ్రికి దూరంగా భర్తనే తన జీవితం అనుకుంటుంది. తనను నమ్ముకొని వచ్చిన భార్యను కష్టపెట్టకుండా చూసుకోవాలని భర్త అనుకుంటారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. కానీ ప్రస్తుతం చాలా మంది విడాకుల బాట పడుతున్నారు. ఒకరి తప్పు ఉంటే మరొకరు సర్దుకొని పోవడం లేదు. ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్థల వల్ల జీవితాలు విచ్చిన్నం అవుతున్నాయి. అయితే ఒక మంచి భార్య ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేశారు చాణక్యుడు. భార్య అంటే ఉదయం తన భర్తకు తల్లిలా సేవ చేసి, పగటి పూట సోదరిలా ప్రేమించి, రాత్రి వేళ వేశ్యలా సంతోషపెట్టేది అని నిర్వచనం ఇచ్చారు చాణక్యుడు.
ప్రేమగల, నిజాయితీగల భార్య
భార్య భర్తల మధ్య మంచి బంధం ఉండాలంటే ఇద్దరి మధ్య ప్రేమ, నిజాయితీ కచ్చితంగా ఉండాలి. భార్యకు నిజమైన అందం భర్తకు సేవ చేయడంలోనే ఉంటుంది అని తెలిపారు చాణక్యుడు. భార్య తన భర్తను ప్రేమించాలి. నిజం మాట్లాడాలి. ఇలా ఉండడం వల్ల కుటుంబం బాగుంటుంది. భార్య తన భర్త సమ్మతితో చేసే పని వల్ల కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుందని తెలిపారు చాణక్యుడు.
అందమైన భార్య – మంచి కుటుంబం
ఒక అమ్మాయిని భార్యగా చేసుకోవాలంటే ఆమె అందంగా ఉందా అని చూడకూడదు. అందమైన భార్య రావడం మాత్రమే మంచిది కాదు. మనుసు, వ్యక్తిత్వం బాగుండాలి అన్నారు చాణక్యుడు. మంచి కుటుంబానికి చెందకపోతే ఆమెతో పెళ్లి చేసుకోవద్దు అన్నారు. అమ్మాయి అందంగా లేకపోయినా మంచి కుటుంబం నుంచి వచ్చింది అయితే పెళ్లి చేసుకోవాలని సూచించారు చాణక్యుడు.
మంచి భార్య గొడవ పడదు..
చాణక్యుడి ప్రకారం.. భార్య ఎటువంటి కారణం లేకుండా భర్తతో గొడవ పడకూడదు. భోజనం చేసే సమయంలో భర్తను తల్లిలా చూసుకోవడం, రోజులో భర్తకు సోదరిలా ఉండడం, దాసిలా సేవ చేయడం, సంభోగ సమయంలో వేశ్యలా ఉండే భార్య మంచిదని.. ఇలాంటి భార్య ఉండడం వల్ల ఆ భర్త జీవితాంతం సంతోషంగా ఉంటాడని తెలిపాడు.