Site icon OkTelugu

Summer Heat Safety Tips: ఎండలో నుంచి రాగానే.. ఏసీ రూంలోకి వెళ్లడం మంచిదేనా..

Summer Heat Safety Tips

Summer Heat Safety Tips

Summer Heat Safety Tips: ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. వేడి వల్ల వడగాలి కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది. విపరీతంగా దాహం వేస్తూ ఉంటుంది. ఎండలో ఏదైనా పని చేస్తే చెమట కూడా పోస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరం చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు నీడ ఉన్న ప్రదేశంలోకి లేదా చల్లగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు చాలామంది ఏసీ గదిలోకి వెళ్తుంటారు.

ఫ్యాన్ లేదా కూలర్ అనేవి ఒక స్థాయి వరకు మాత్రమే చల్లదనం ఇస్తాయి. ఏసీ మాత్రం విపరీతమైన చల్లదనాన్ని అందిస్తూ ఉంటుంది. పైగా ఉష్ణోగ్రతను తగ్గిస్తే ఏసి మరింత చల్లటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అందువల్లే ఎండాకాలంలో చాలామంది ఏసీలు వాడుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎండలో పనిచేసి చల్లదనం కోసం ఏసీ గదిలోకి వెళ్లడం కరెక్ట్ కాదట.. ఇదే విషయాన్ని వైద్యులు చెబుతున్నారు.

ఎండలో పనిచేసి.. శరీరాన్ని కూల్ చేసేందుకు చాలా మంది ఏసీ గదిలోకి వెళ్తుంటారు. కానీ అలా అకస్మాత్తుగా వెళ్లడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చెమట అనేది ఎండాకాలంలో అధికంగా ఉంటుంది. రక్త నాళాల వ్యాకోచం వంటి విధానాల ద్వారా మానవ శరీరం స్థిరమైన ఉష్ణోగ్రతను కొనసాగిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలో మార్పులు వస్తే ఆ వ్యవస్థలు మొత్తం దెబ్బతింటాయి. అనారోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి. అందువల్ల కొద్ది నిమిషాల పాటు నీడలో ఉండాలి. ఆ తర్వాత ఏసీ గదిలోకి వెళ్లాలి. అప్పుడే శరీరంలో ఉన్న అన్ని మెకానిజాలు పనిచేస్తూ ఉంటాయి.

ఏసీ ద్వారా చల్లదనం వస్తుంది అనేది నిజమే. కానీ అస్తమానం ఏసీ లో ఉండడం కూడా కరెక్ట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ముఖం మీద జిడ్డు.. శ్వాస కోశ సమస్యలు.. చర్మ సంబంధిత వ్యాధుల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లదనం కోసం ఏసీలో ఉండడం సరైనదే అయినప్పటికీ.. ఆస్తమానం ఏసీలో ఉండడం కూడా కరెక్ట్ కాదని వైద్యులు అంటున్నారు. శరీర ఉష్ణోగ్రతల మెకానిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version