LIC: ఎల్ఐసీ సూపర్ పాలసీ.. వందేళ్లు వచ్చేవరకు ఆదాయం పొందే అవకాశం?
LIC: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తూ పాలసీ తీసుకున్న వాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీ పాలసీలను అమలు చేస్తుండటం గమనార్హం. ఎల్ఐసీ పాలసీలలో ఒకటైన జీవన్ ఉమాంగ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. పాలసీ మొత్తం ప్రీమియంలను చెల్లించడం ద్వారా నిర్దేశించిన కాలపరిమితికి ఎన్నో బెనిఫిట్స్ […]

LIC: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తూ పాలసీ తీసుకున్న వాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీ పాలసీలను అమలు చేస్తుండటం గమనార్హం. ఎల్ఐసీ పాలసీలలో ఒకటైన జీవన్ ఉమాంగ్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుంది.
పాలసీ మొత్తం ప్రీమియంలను చెల్లించడం ద్వారా నిర్దేశించిన కాలపరిమితికి ఎన్నో బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీకి క్లెయిమ్ కనీస హామీ మొత్తం 2 లక్షల రూపాయలు కాగా గరిష్ట హామీ మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. ప్రీమియం చెల్లించడానికి 15, 20, 25, 30 సంవత్సరాలు కాలపరిమితిగా ఉండనుంది. 90 రోజుల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు.
ప్రీమియం చెల్లించడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు కాగా గరిష్ట వయస్సు 70 సంవత్సరాలుగా ఉండనుంది. పాలసీ మెచ్యూరిటీకి గరిష్ట వయస్సు 100 సంవత్సరాలుగా ఉండనుంది. పుట్టిన పిల్లలకు మూడు నెలల తర్వాత పాలసీ తీసుకుంటే 30 సంవత్సరాల తర్వాత బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంది. పాలసీ కొనుగోలు చేసిన ఐదు సంవత్సరాలలో మరణిస్తే పాలసీ హామీ మొత్తం నామినీకి అందే ఛాన్స్ ఉంటుంది.
మెచ్యూరిటీ సమయంలోపు పాలసీదారుడు మృతి చెందితే హామీ మొత్తం నామినీ లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 25 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాలు ప్రీమియం చెల్లించేలా పాలసీని తీసుకుంటే సంవత్సరానికి 14,758 రూపాయల చొప్పున చెల్లించాలి. ఇలా 30 సంవత్సరాలు చెల్లిస్తే 55 సంవత్సరాల నుంచి 100 ఏళ్లు వచ్చేవరకు 8 శాతం పొందే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారుడు వందేళ్ల వరకు జీవించి ఉంటే 63,08,250 రూపాయలు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రూ.125 పొదుపుతో రూ.25 లక్షలు?