Let Get Married Collections: నిర్మాతగా ధోనికి షాక్… ఫస్ట్ మూవీ కలెక్షన్స్ లెక్కలు ఇవే!
ఫన్ ఎలిమెంట్స్ తో రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన LGM (Let’s Get Married) తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 400 స్క్రీన్ లో రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షో కి 20 శాతం, మ్యాట్నీకి 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Let Get Married Collections: మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తమ బ్యానర్ లో తొలి సినిమా గా తెరకెక్కించిన LGM (Let’s Get Married) మూవీ కోలీవుడ్ లో విడుదలైంది. ముందుగా తెలుగు తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నారు. అందుకోసం ధోనీ సతీమణి సాక్షి కూడా హైదరాబాద్ వేదికగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. కానీ కొన్ని కారణాల వలన మీదట తమిళం లోనే విడుదల చేశారు.
లవ్ టుడే ఫేమ్ ఇవానా, జెర్సీ ఫేమ్ హరీష్ శంకర్ జంటగా నదియా కీలక పాత్రలో ఈ చిత్రం రూపొందింది. చిన్న సినిమాగా మొదలుపెట్టి కథ డిమాండ్ చేయటంతో దాదాపు 8 కోట్లు దాకా ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. ధోని బ్యానర్ నుంచి వస్తున్నా మొదటి సినిమా కావడంతో పైగా తమిళంలో రిలీజ్ కావడంతో తలైవా ధోని ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపించారు.. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు అర కోటి వచ్చాయి. అయితే సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిన కానీ, విమర్శకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఫన్ ఎలిమెంట్స్ తో రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన LGM (Let’s Get Married) తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 400 స్క్రీన్ లో రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షో కి 20 శాతం, మ్యాట్నీకి 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో కు ఈ సినిమా ఆక్యుపెన్సీ 30 శాతం, సెకండ్ షో కు 25 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. దీంతో అనుకున్న రేంజ్ లో కలెక్షన్ రాలేదని తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్, ఓవర్సిస్ కలెక్షన్స్ అన్ని కలిపి తొలిరోజు 1.25 కోట్లు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది.
అయితే సినిమా దాదాపు 9 కోట్లు సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. సినిమాకు వస్తున్నా రివ్యూస్ చూస్తే బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమే అనిపిస్తుంది. వీకెండ్ ముగిసేసరికి 3 కోట్లు దాకా వసూళ్లు సాధించగలిగితే ఆ తర్వాత బ్రేక్ ఈవెన్ దగ్గరికి ఎలాగోలా నెట్టుకొని రావచ్చు. లేకపోతే ఈ సినిమా తీసుకున్న బయ్యర్లు నష్టాలు చవిచూడక తప్పదు.
