Diwali Holiday in US : అమెరికాలో మన ‘దీపావళి’ వెలుగు.. అగ్రరాజ్యాన దక్కిన మరో గౌరవం
ఈ సందర్భంగా న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యం. ఈరోజు ప్రాముఖ్యతను అమెరికాలో తెలిపేందుకు తొలి అడుగుగా బిల్లును ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

Diwali Holiday in US : భారతదేశంలో అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ప్రతీ సంవత్సరం నవంబర్, డిసెంబర్లో వచ్చే ఈ ఫెస్టివల్ రోజున దేశ వ్యాప్తంగా దీపకాంతులీనుతాయి. కుల,మతం,ప్రాంతీయ బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ జరుపుకునే ఈ రోజున ప్రజలు సంతోషంగా ఉంటారు. టపాలసులు పేలుస్తూ, లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు. దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి నిదర్శనంగా భావిస్తారు.
అందుకే ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లు,కార్యాలయాల్లో దీపాలను వెలిగిస్తారు. భారతదేశంలో జరుపుకునే దీపావళిని చూసి ఇతరదేశాలు ఇంప్రెస్ అవుతున్నాయి. తమదేశాల్లోనూ దీపావళి పండుగను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో దీపావళి పండుగను తాము కూడా జరుపుకుంటామని, ఈ రోజున సెలవుదినంగా ప్రకటించాలని అమెరికాలోని కాంగ్రెస్ చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టాయి. వీరు పెట్టిన బిల్లుకు దేశ వ్యాప్తంగా వివిధ సంఘాలుస్వాగతించాయి.
అమెరికాలో తెలుగువారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతోభారతదేశంలో జరుపుకునే పండుగలన్నీ అక్కడా నిర్వహిస్తున్నారు. ఆ దేశంలో ఉండే అత్యధికంగా తెలుగు వారు ఇప్పటికే దీపావళి రోజున సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇక్కడ నివసిస్తున్న తాముకూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి హాలీడే ఉండాలనికోరుతున్నారు. ఎక్కువ శాతం మందిప్రజల డిమాండ్ ను కాంగ్రెస్ సభ్యులు చట్టసభల్లో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యం. ఈరోజు ప్రాముఖ్యతను అమెరికాలో తెలిపేందుకు తొలి అడుగుగా బిల్లును ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉందని అన్నారు. దీపావళి పండుగ రోజు సెలవు కోసం దక్షిణాసియగా వారిని గుర్తిస్తూ కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయస్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని సెలవుదినంగా ప్రకటించేందుకు బిల్లును ప్రవేశపెట్టినట్లు జెన్నీఫర్ తెలిపారు. ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే దేశవ్యాప్తంగా 12వ హాలిడేగా దీపావళికి గుర్తింపు దక్కుతుంది.
