బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

తాము బీజేపీకే దూరమయ్యాం కానీ.. హిందుత్వానికి కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు. రామ్‌ లల్లా ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకి వచ్చానని ఠాక్రే తెలిపారు. ‘గత ఏడాదిన్నరలో నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను ఈ రోజు ప్రార్థనలు కూడా చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా, రామ మందిరం నిర్మాణం కోసం నా ట్రస్టు […]

  • Written By: Neelambaram
  • Published On:
బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

తాము బీజేపీకే దూరమయ్యాం కానీ.. హిందుత్వానికి కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు. రామ్‌ లల్లా ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకి వచ్చానని ఠాక్రే తెలిపారు.

‘గత ఏడాదిన్నరలో నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి. నేను ఈ రోజు ప్రార్థనలు కూడా చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా, రామ మందిరం నిర్మాణం కోసం నా ట్రస్టు నుంచి కోటి రూపాయలను విరాళంగా ఇస్తాను’ అని ప్రకటించారు.

తామే అసలైన హిందూవాదులమని పేర్కొంటూ బీజేపీ హిందుత్వాన్ని ఎప్పుడో విడిచిపెట్టిందని ధ్వజమెత్తారు.బీజేపీ అంటే హిందుత్వ అని కాదని, హిందుత్వ వేరు, బీజేపీ వేరని అన్నారాయన. రాముడు, హిందుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదంటూ బీజేపీని పరోక్షంగా విమర్శించారు.

బీజేపీ అంటే హిందుత్వ అని కాదని, హిందుత్వ వేరు, బీజేపీ వేరని అన్నారాయన. రాముడు, హిందుత్వం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదంటూ బీజేపీని పరోక్షంగా విమర్శించారు.

కాగా, శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయ కూడా పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించింది. రాముడు, హిందుత్వ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని పేర్కొంటూ 80 గంటల్లో ప్రభుత్వాన్ని కోల్పోయిన వారు థాకరే ప్రభుత్వం కనీసం 100 గంటలు కూడా ప్రభుత్వాన్ని నడపలేదని విమర్శించారని, కానీ ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వం ప్రజల విశ్వాసం పొందడంతో పాటు చక్కటి పనితీరుతో వారి హృదయాల్లో నిలిచిపోయిందని పేర్కొంది. ఈ శుక్రవారంతో థాకరే ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది.

సంబంధిత వార్తలు