డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ ప్రముఖ కమెడియన్.. ఎవరో తెలుసా..?

కరోనా కల్లోలంతో హైదరాబాద్ సహా దేశమంతా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఆగిపోయాయి. ఒకరు ఊదాక.. మరొకరు ఊదితే అసలే కరోనా కాలంలో వైరస్ వ్యాపిస్తుందని ఇన్నాళ్లు ఈ టెస్టులు చేయలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో అనేక మంది పట్టుబడుతున్నారు. మహానగరం కావడంతో ఇక్కడ నిత్యకృత్యంగా తాగిపట్టుబడడం కామన్ గా కనిపిస్తోంది. ఈ విషయంలో సామాన్యుల సంగతి పక్కనపెడితే.. సెలబ్రెటీలు తాజాగా డ్రంకెన్ డ్రైవ్ […]

  • Written By: NARESH
  • Published On:
డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ ప్రముఖ కమెడియన్.. ఎవరో తెలుసా..?

కరోనా కల్లోలంతో హైదరాబాద్ సహా దేశమంతా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఆగిపోయాయి. ఒకరు ఊదాక.. మరొకరు ఊదితే అసలే కరోనా కాలంలో వైరస్ వ్యాపిస్తుందని ఇన్నాళ్లు ఈ టెస్టులు చేయలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో అనేక మంది పట్టుబడుతున్నారు. మహానగరం కావడంతో ఇక్కడ నిత్యకృత్యంగా తాగిపట్టుబడడం కామన్ గా కనిపిస్తోంది. ఈ విషయంలో సామాన్యుల సంగతి పక్కనపెడితే.. సెలబ్రెటీలు తాజాగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది.

గతంలోనూ పలువురు టీవీ నటులు ఇలా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. అయితే సమాజానికి మంచి చెప్పే వీళ్లు రియల్ లైఫ్ కు వచ్చే సరికి మాత్రం పాటించరా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేయరాదని ప్రచారం చేయాల్సిందిపోయి.. ఇలా పట్టుబడడం వారి కెరీర్ పై మచ్చ పడే అవకాశం లేకపోలేదు. అయితే కొందరు మాత్రం ఇలా ఓసారి దొరికి మరోసారి డ్రంక్ చేసినా డ్రైవ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ పరీక్షలో దొరికి తన తప్పులను తెలుసుకొని మరోసారి ఆ పని చేయకుండా కామ్ గా ఉంటున్నారు. వీరిని చూసైనా సెలబ్రెటీలు మారకపోవడం ఆందోళనకరమంటున్నారు. తాజాగా మద్యం తాగా వాహనాలు నడిపిన వారికి నిర్వహించిన పరీక్షలో ఓ సెలబ్రెటీ దొరికిపోవడం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో వరుస సెలవుల కారణంగా శుక్రవారం రాతి మద్యం తాగి ఓ ప్రముఖ జబర్ధస్త్ కమెడియన్ దొరికిపోయాడు.

తాజాగా హైదరాబాద్ లో పోలీసులు వీకెండ్ కారణంగా ప్రతీ శుక్రవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఆయా పర్సంటేజీల ప్రకారం ఫైన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ ఫేం.. లేడీ గెటప్ లు వేసే తన్మయి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడడం వివేషం. అతనితో పాటు జబర్దస్త్ ప్రొగ్రాం కు చెందిన మరి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Read Today's Latest Most popular News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు