Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్ పేపర్ చూశారా? అనూహ్యంగా ఆ హీరో కూడా!
నిశ్చితార్థం ముగిసిన వెంటనే కొత్త జంట విదేశాల్లో విహరించారు. ఓ రొమాంటిక్ టూర్ కి వెళ్లారు. ఇటీవల లావణ్య త్రిపాఠి కాబోయే భర్త వరుణ్ తేజ్ తో ఉన్న ఫోటో షేర్ చేసింది.

Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానున్నారు. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్-లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ హాజరైన ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇక త్వరలో ఆ పెళ్లి తంతు కూడా పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
నిశ్చితార్థం ముగిసిన వెంటనే కొత్త జంట విదేశాల్లో విహరించారు. ఓ రొమాంటిక్ టూర్ కి వెళ్లారు. ఇటీవల లావణ్య త్రిపాఠి కాబోయే భర్త వరుణ్ తేజ్ తో ఉన్న ఫోటో షేర్ చేసింది. ఇది వైరల్ గా మారింది. కాగా లావణ్య త్రిపాఠి తన ఫోన్ వాల్ పేపర్ షేర్ చేసింది. ఆ వాల్ పేపర్ కొన్ని ఫోటోల సమాహారంగా ఉంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో దిగిన ఫోటోలతో కూడిన ఆ వాల్ పేపర్లో వరుణ్ తేజ్ కి కూడా స్థానం ఇచ్చింది. గతంలో లావణ్య-వరుణ్ కలిసి దిగిన ఫోటో కూడా తన వాల్ పేపర్ పై ఉంది.
కాగా ఐదేళ్లకు పైగా లావణ్య-వరుణ్ తేజ్ రిలేషన్ లో ఉన్నారు. రెండేళ్లుగా వీరు ఎఫైర్ లో ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే లావణ్య త్రిపాఠి పలుమార్లు ఈ వార్తలను ఖండించారు. మేము స్నేహితులం మాత్రమే అంటూ బుకాయించారు. సడన్ గా నిశ్చితార్థం అంటూ షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ న్యూస్ జనాల్లో నానుతుండగా పెద్దగా సెన్సేషన్ కాలేదు. 2017లో వీరి కాంబినేషన్ లో మిస్టర్ మూవీ వచ్చింది.
అప్పుడు మొదలైన పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది. 2020లో అంతరిక్షం టైటిల్ తో మరో మూవీ చేశారు. బలపడిన ప్రేమ బంధం పెళ్ళికి దారితీసింది. మరోవైపు లావణ్య కెరీర్ నెమ్మదించింది. ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆఫర్స్ తగ్గాయి. ఇక వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. గాంఢీవదారి అర్జున మూవీతో పాటు మరొక చిత్రంలో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఆయన గత చిత్రం గని నిరాశపరిచింది.
