Lavanya Tripathi: 3 కోట్ల ఆఫర్ వదులుకున్న లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ వల్లనే ఈ ఆఫర్ ను వదులుకుందా?
మెగా కుటుంబంలో అడుగుపెట్టడం అంటే పెద్ద బాధ్యత.ఏం చేయాలన్నా మాట్లాడాలన్నా కూడా అభిమానులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిందే. కొంచం అంటూ ఇటుగా ఉన్నా వాళ్ళు తీసుకోలేరు.

Lavanya Tripathi: అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి, టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. సినిమాల్లో సీన్లు ఎలా ఉన్నా హద్దులు దాటి, గ్లామరస్ పాత్రలు, లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉంది లావణ్య. కానీ కెరీర్ ప్రారంభం లో చాలా మంది హీరోయిన్స్ ఇదే విధంగా నడుచుకునేవారు. తమన్నా, సమంత వంటి వారు కూడా మొదట్లో గ్లామర్ పాత్రల్లో నటించడానికి ఇష్టటపడేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వచ్చిన తర్వాత ఇలాంటి కంటెంట్ కి యూత్ ఆడియన్స్ బ్రహ్మారథం పాడుతున్నారు. అందుకే తమన్నా, సమంత వంటి వారు కూడా బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి కి ఓ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ అందులో బోల్డ్ కంటెంట్ బోలెడంత ఉందట. కెరీర్ లో ఇప్పటి వరకు ఆఫర్ చెయ్యని రేంజ్ రెమ్యూనరేషన్ ని ఆఫర్ చేసారు. దాదాపుగా 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తామన్నారట. అంత ఆఫర్ చేసినా కూడా లావణ్య త్రిపాఠి ఒప్పుకోలేదట. కారణం వరుణ్ తేజ్ తో పెళ్లి ఫిక్స్ అవ్వడమే అని టాక్ వినిపిస్తుంది.
మెగా కుటుంబంలో అడుగుపెట్టడం అంటే పెద్ద బాధ్యత.ఏం చేయాలన్నా మాట్లాడాలన్నా కూడా అభిమానులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిందే. కొంచం అంటూ ఇటుగా ఉన్నా వాళ్ళు తీసుకోలేరు. ఆ విషయంలో నోటుకి నూరుపాళ్లు విజయం సాధించారు రామ్ చరణ్- ఉపాసన. ఇప్పుడు లావణ్యాత్రిపాఠి కూడా అదే విధంగా వ్యవహరించాల్సిందే.
ఇటీవలే వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒకటికానున్నారు. ఈ కారణంగానే లావణ్య సినిమాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ఒకే ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా తప్ప మరే సినిమాకు కూడా ఆమె సైన్ చేయలేదు.
అయితే తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ ను విశ్వక్ ఖండేరావ్ తెరకెక్కించనున్నాడు. కథ పరంగా ఈ సిరీస్ లో హీరోయిన్ పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుందని సమాచారం.అంతేకాదు ఇంటిమేట్ సీన్స్ కూడా ఉండనున్నాయట. దీంతో ఈ సిరీస్ మేకర్స్ కు మరో హీరోయిన్‌ని చూసుకోమని చెప్పేశారట లావణ్య. త్వరలో పెళ్లి కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి కథల్లో నటించడం కరక్ట్ కాదని వారికి వివరించిందట లావణ్య. దీంతో ఆమె ఈ సిరీస్ నుండి అఫీషియల్ గా బయటకు వచ్చేశారు.
