Lavanya Tripathi- Varun Tej: పెళ్లి పనుల్లో బిజీ బిజీ… అక్కడ తేలిన లావణ్య-వరుణ్ తేజ్!
ఇండియా లేదా అవుట్ సైడ్ ఇండియా పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని వరుణ్ స్పష్టం చేశారు.

Lavanya Tripathi- Varun Tej: లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్ళికి ఏర్పాట్లు మొదలయ్యాయనే మాట వినిపిస్తోంది. ఈ జంట పెళ్లి షాపింగ్ లో బిజీగా ఉన్నారట. తాజాగా వీరిద్దరూ ప్రముఖ డిజైనర్ స్టోర్ వద్ద సందడి చేశారు. వరుణ్ తేజ్ లాస్ట్ రిలీజ్ గండీవధారి అర్జున. ఈ చిత్ర ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లోనే పెళ్లి ఉండవచ్చు. పెళ్లి ఎప్పుడనేది అమ్మ నిర్ణయిస్తుంది. బహుశా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉండొచ్చు అన్నారు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఇండియా లేదా అవుట్ సైడ్ ఇండియా పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని వరుణ్ స్పష్టం చేశారు. పెళ్లి అనంతరం హైదరాబాద్ లో చిత్ర ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని అన్నారు. వరుణ్ తేజ్ చెప్పినట్లే నవంబర్ నెలలో లావణ్యతో పెళ్ళికి ముహూర్తం కుదిరిందనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి పనులు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి.
ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్ట్రోర్ ని వరుణ్-లావణ్య సందర్శించారు. పెళ్ళికి కావాల్సిన బట్టలు డిజైన్ చేయించేందుకే వెళ్లారని టాక్. వరుణ్, లావణ్య జంటగా షాపింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటలీనే వివాహానికి వేదిక కావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి మెగా హీరో వరుణ్ సింగిల్ స్టేటస్ నుండి మ్యారీడ్ కాబోతున్నాడన్న మాట.
దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్-లావణ్య జంటగా నటించారు. అప్పుడే వీరి ప్రేమకు బీజం పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చాలా కాలం ఈ జంట రహస్యంగా ప్రేమించుకున్నారు. ఓ రెండేళ్ల క్రితం పుకార్లు రేగాయి. అప్పటికీ లావణ్య ఖండించడం విశేషం. జూన్ 9న సడన్ గా నిశ్చితార్థం జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
https://twitter.com/HaashtagCinema/status/1702989787572170784
