Bigg Boss 7 Telugu : లేటెస్ట్ సర్వేలో షాకింగ్ నిజాలు… బిగ్ బాస్ టాప్ 5 ఎవరో తెలుసా?
టాప్ 5 మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ఐదవ స్థానంలో ప్రిన్స్ యావర్ నిలిచాడు. ఇక టాప్ 4 లో ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఉన్నాడు.

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. కాగా ఈ వారం ఎలిమినేషన్ లేదని తెలిసిపోయింది. అయితే హౌస్ లో ఇప్పుడు పది మంది ఉన్నారు. వచ్చే వారం డబల్ ఎలిమినేషన్ ఉండవచ్చు అని అంటున్నారు. లేదంటే మరో రెండు వారాలు సీజన్ ఎక్స్టెండ్ చేస్తారని తెలుస్తోంది. కాగా హౌస్ లో ఉన్న పది మందిలో టాప్ 5 కి చేరుకునే కంటెస్టెంట్స్ లిస్ట్ ని ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ రిలీజ్ చేసింది.
ఇది ఇలా ఉంటె .. ప్రస్తుతం హౌస్ లో ఉన్న శివాజీ, గౌతమ్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి, అశ్విని, రతిక, అమర్ దీప్ ఉన్నారు. కాగా వీరిలో టాప్ 5 కి ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు టాప్ అంటే శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అర్జున్ లేదా ప్రియాంక పేరు వినిపించేది. కానీ ఆ లెక్కలు తారుమారయ్యాయి. ఇక నవంబర్ 11 వ తేదీ నుంచి 17 వ తారీకు వరకు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే నిర్వహించింది.
టాప్ 5 మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో ఐదవ స్థానంలో ప్రిన్స్ యావర్ నిలిచాడు. ఇక టాప్ 4 లో ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఉన్నాడు. గౌతమ్ అసలు టాప్ 5 లో ఉంటాడని ఎవరు అనుకోలేదు. కానీ అతని ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాప్ 4 లో నిలిచాడు. అమర్ దీప్ టాప్ 3 లో ఉన్నాడు. వాస్తవానికి అమర్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్ తో గొడవ పడడం అమర్ కి అతి పెద్ద మైనస్ అయింది.
తర్వాత టాప్ 2 లో పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఒక కామన్ గా హౌస్ లో అడుగుపెట్టి. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఇక టాప్ 1 లో శివాజీ ఉన్నాడు. ఆట పరంగా మాట తీరు పరంగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేశాడు. అయితే ఈ సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ అంటున్నారు. అతనికి కామన్ మాన్ గా ఉన్న క్రేజ్ ని బట్టి విన్నర్ గా ప్రకటించాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నట్లు సమాచారం.
Ormax Characters India Loves: Top 5 most popular #BiggBossTelugu7 contestants (Nov 11-17) pic.twitter.com/3S0qiVKAO5
— Ormax Media (@OrmaxMedia) November 19, 2023
