
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీ ఓటమి ఖాయమని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు టీడీపీ నేతలను నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇప్పటికే చంద్రబాబు మేలుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ఆరోపించారు.