CM Revanth Reddy: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆస్తవ్యస్తంగా ఉంది. పదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నాం. ప్రజల ఆక్షాంక్షలు నెరవేర్చడమే మా అజెండా. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు మహిళలు. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని రేవంత్ రెడ్డి అన్నారు.