Tata Company : ఐటీ రంగంలో టాటా కంపెనీ దేశీయంగా నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రతి ఏడాది లాభాలను పెంచుకుంటూ.. ఉద్యోగులను కూడా అదే స్థాయిలో హెచ్చించుకుంటూ పోతున్నది. దేశంలో దక్షిణాది ఉత్తరాది అని తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో క్యాంపస్ లు ఏర్పాటుచేసి.. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధిని ఇస్తోంది. అందువల్లే టాటా కంపెనీలు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాయి. ఇటీవల టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూసినప్పటికీ.. ఆయన సవతి సోదరుడు నోయల్ టాటా టాటా గ్రూప్స్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రతన్ టాటా కన్నుమూసినప్పుడు దేశం మొత్తం కన్నీటి పర్యంతమైంది. తమ ఇంట్లో వ్యక్తి చనిపోయినట్టుగా బాధపడింది. దేశం మొత్తం ఘనంగా ఆ వ్యాపార దార్శనికుడికి నివాళులర్పించింది. అయితే ఇదే సమయంలో రతన్ టాటా వ్యాపార విలువలు కొనసాగిస్తామని టాటా కంపెనీ స్పష్టం చేసింది. దానికి తగ్గట్టుగానే వ్యాపార విస్తరణకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దిగ్గజ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ లో టాటా కంపెనీ వాటాలు కొనుగోలు చేసింది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికీ నిజం.
టాటా స్టీల్స్ కొనుగోలు చేసింది
టాటా గ్రూప్ లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత ఆ స్థాయిలో లాభాలను ఆర్జించే సంస్థగా టాటా స్టీల్స్ కు పేరుంది. ఇప్పుడు ఆ సంస్థ అతిపెద్ద స్టెప్ వేసింది. తమిళనాడు ప్రాంతంలోని ఐఫోన్ ప్లాంట్ కోసం తైవాన్ దేశానికి చెందిన పెగాట్రాన్ తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఐఫోన్ తయారు చేసే ప్లాంట్ లో టాటా స్టీల్ మెజారిటీ వాటా దక్కించుకుంది . ఈ ప్లాంట్ లో పదివేల మంది పనిచేస్తున్నారు. తాజా ఒప్పందం ప్రకారం టాటా కంపెనీకి ఇందులో 60% వాటా దక్కుతుంది. పెగట్రాన్ కు 40% వాటా ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి ఏడాది ఐదు మిలియన్ ఐఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే టాటా కంపెనీకి ఐఫోన్ ఫ్యాక్టరీ ఇదే మొదటిది కాదు . ఆ కంపెనీకి మనదేశంలో ఇప్పటికే రెండు ఐఫోన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తమిళనాడు ఫ్యాక్టరీ ద్వారా టాటా ఖాతాలో మూడవ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చేరింది. అయితే ఈ ఫ్యాక్టరీలలో ఐఫోన్ కంపెనీకి చెందిన ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తారు. ఇందులో కొన్ని పరికరాలు చైనా నుంచి.. మరి కొన్ని పరికరాలు తైవాన్ నుంచి వస్తాయి. తైవాన్ నుంచి ఎక్కువగా చిప్, ఇతర సర్క్యూట్స్ ఓడల ద్వారా వస్తాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి సముద్ర మార్గం ఉండడంతో.. ఇక్కడి పోర్టుకు ఇతర దేశాల నుంచి సెల్ ఫోన్ సంబంధిత పరికరాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా అన్లోడ్ చేసి.. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్లాంట్ కు తరలించి.. అనంతరం అసెంబ్లింగ్ చేస్తారు. అయితే ఈ డీల్ విలువ ఎంత అనేది టాటా కంపెనీ బయటకు చెప్పలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విలువ సుమారు మూడు నుంచి ఐదువేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tata steel has acquired a majority stake in the iphone manufacturing plant
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com