Site icon OkTelugu

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Tax on petrol and diesel

Tax on petrol and diesel

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి. తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 31 పైసలు వరకు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81, డీజిల్ లీటర్ రూ. 89.18కు పెరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్ పెట్రోల్ పై రూ. 8.49, డీజిల్ పై రూ. 8.39 పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ. 105 గా ఉంది. తెలుగు రాష్ట్రల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 10 మార్క్ ను దాటగా డీజిల్ రూ. 100 వైపు పరుగులు పెడుతుంది.

Exit mobile version