
సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. మైనింగ్ లీజ్ లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందన్నారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని పిటిషన్ లో రఘురామ పేర్కొన్నారు.