
ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు దశల ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలకు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన అధ్యక్షతన అత్యున్నత సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఆయన బెంగాల్ పర్యటనను రద్దు చేసుకోవడం ఇదే ప్రథమం.