Site icon OkTelugu

Pakistan Cricket Board : ఇందుకే మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఏ విదేశీ క్రికెటర్ రానిది..

Pakistan Cricket Board

Pakistan Cricket Board : క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ ఆడేవారు జెంటిల్మెన్ మాదిరిగా ప్రవర్తించాలి కాబట్టి ఆ ఆటకు అలాంటి పేరు వచ్చింది. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. గెలిచినా.. ఓడిపోయినా ప్రత్యర్థి ప్లేయర్లను ఇబ్బంది పెట్టకూడదు. మాటలతో రెచ్చగొట్టకూడదు. చేష్టలతో కవ్వించకూడదు. స్థూలంగా చెప్పాలంటే ఆటను ఆట మాదిరిగా ఆడాలి. అప్పుడే ఆడే వాళ్లకు గౌరవం.. చూసేవాళ్ళకు ఆనందం.

క్రికెట్ ఆటకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈరోజుకు కూడా క్రికెట్ అనేది విశ్వవ్యాప్తంగా విస్తరిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం ఆటగాళ్ల ఆట తీరు. అయితే తులసి వనంలో గంజాయి మాదిరిగా కొంతమంది క్రికెట్ ఆటకు చెడ్డ పేరు తీసుకొస్తుంటారు. అంతేకాదు తమ ప్రవర్తనతో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి ప్రవర్తన అలా ఉంటుంది మరి.

బిసిసిఐ ఐపీఎల్ నిర్వహిస్తోంది. 2008 నుంచి ఈ టోర్నీని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఎంతో మంది స్వదేశీ, విదేశీ ప్లేయర్లకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. ఇక స్వదేశంలో క్రీడాకారులకు అయితే జాతీయ జట్టులో చోటు కూడా కల్పిస్తోంది. అందువల్లే ఐపిఎల్ లో ఆడేందుకు చాలామంది ఆటగాళ్లు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాలలో వేలంలో ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోతే తమ బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫీజు చెల్లింపు నుంచి మొదలుపెడితే సౌకర్యాల వరకు ప్రతి విషయంలోనూ బీసీసీఐ పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంటుంది కాబట్టి ఆటగాళ్లు తమ ఫస్ట్ ప్రయారిటీ ఐపిఎల్ కు ఇస్తారు.

ఐపీఎల్ ను చూసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ పేరుతో ఒక టోర్నీ మొదలుపెట్టింది. దీని నిర్వహణ అనేక సందర్భాలలో ఆభాసు పాలైంది. అయినప్పటికీ డోంట్ కేర్ అన్నట్టుగా పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తూనే ఉంటుంది. నిబంధనల విషయంలో.. క్రమశిక్షణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పాకిస్తాన్ జాతీయ జట్టులో ఆటగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు. అలాంటప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం అంతకంటే గొప్పగా ఏముంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ఇమాద్ వసీం అనే క్రీడాకారుడు ధూమపానం చేశాడు. పైగా డ్రెస్సింగ్ రూమ్ అని కూడా చూడకుండా అతడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇలాంటి వ్యవహారాలు సాగుతూ ఉంటాయి కాబట్టి మాక్స్ వెల్, డూ ప్లెసిస్, హ్యారీ బ్రూక్ లాంటి ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు నో చెప్పారు. ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో కూడా పాకిస్థాన్ ప్లేయర్లు ఇలానే వ్యవహరించారు. డ్రెస్సింగ్ రూమ్ లో కొట్టుకోవడం.. క్రమశిక్షణ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం.. దుర్భాషలాడుకోవడం వంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ అంటేనే ఒక చెత్త దేశం. అక్కడ క్రికెట్ నిర్వహణ అంతకంటే గొప్పగా ఎలా ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Exit mobile version