https://oktelugu.com/

OYO : ఓయో రూమ్ లు మాత్రమే కాదు.. ఓయో రోడ్లు కూడా ఉంటాయి.. వైరల్ వీడియో

OYO ఓయో .. కొన్ని సంవత్సరాలుగా లాభాలను మాత్రమే నమోదు చేస్తోంది ఈ హాస్పిటాలిటీ సంస్థ. కొవిడ్ మినహా.. మిగతా అన్ని కాలాల్లో ఈ సంస్థ ఎదుగుదల ఆకాశమే హద్దుగా ఉంది.. ఇప్పుడు ఈ సంస్థ దేశవ్యాప్తంగా హోటళ్లను, రూం లను నిర్వహిస్తోంది. ఓ అంచనా ప్రకారం దేశంలో ఉన్న హోటల్ గదులు, ఇతర లాడ్జీలలో 45% ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయంటే మామూలు విషయం కాదు.

Written By: , Updated On : February 16, 2025 / 10:13 AM IST
Follow us on

ఓయో(OYO) ఒక చిన్న అంకుర సంస్థగా(startup) గా ప్రారంభమై.. నేడు ఒక పెద్ద సంస్థగా అవతరించింది. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే ఈ సంస్థలో అందుబాటులో ఉన్న హోటల్ గదులకు, లాడ్జీలకు యువత అధికంగా వెళ్తోంది. అక్కడ ఆ సాంఘిక కార్యకలాపలు జరుగుతాయి, ఇతరత్రా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతాయని ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఓయో జోరు మాత్రం ఆగడం లేదు. ” యువత అపరిమితమైన స్వేచ్ఛను కోరుకోవడానికి.. ఏకాంతాన్ని అనుభవించడానికి.. యువత ఎక్కువగా ఓయో రూం లను ఇష్టపడుతున్నారు. ఇటీవల వాలెంటైన్స్ డే నాడు దేశవ్యాప్తంగా ఉన్న ఓయో రూములకు విపరీతమైన గిరాకీ ఉందట. డిసెంబర్ 31 నాడు, జనవరి 1 నాడు కూడా ఇదే తీరు కొనసాగిందట. కాలంతో సంబంధం లేకుండా గిరాకీలో ప్రతి ఏడాది వృద్ధి కొనసాగుతోందని ఓయో కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ దేశంలో విపరీతమైన వృద్ధిరేటు ఉన్న నేపథ్యంలో.. లాభాలు భారీగా వస్తున్న నేపథ్యంలో ఓయో సంస్థ దేశవ్యాప్తంగా హోటళ్ళు నిర్మిస్తోంది. ఇతర దేశాల్లోనూ కార్యకలాపాలు సాగించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఓయో రూమ్స్ పై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు, ట్రోల్స్, మీమ్స్ కనిపిస్తూనే ఉంటాయి.. వినిపిస్తూనే ఉంటాయి. ఇది కూడా ఆ సంస్థకు క్రేజ్ పెరగడానికి ఒక కారణమైంది. అనతి కాలంలోనే లాభాలు గడించే సంస్థగా ఎదిగేలా చేసింది.

ఇప్పుడు ఓయో రోడ్లు

ఓయో రూం ల గురించి విన్నాం. పేపర్లో చూసాం. టీవీల్లో తిలకించాం.. సోషల్ మీడియాలో గమనించాం.. కొత్తగా ఈ ఓయో రోడ్లు ఏంటి? ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇలా కూడా ఉంటాయా? అనే సందేహాలు మీలో కలిగాయి కదా.. వాస్తవానికి ఓయో రోడ్లు అంటూ ఏమీ ఉండవు.. కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలో ఇవి ఓయూ రోడ్లు అంటూ ఓ నెటిజన్ వీడియో పోస్ట్ చేశాడు.. అది ఎక్కడ ఉందో తెలియదు గానీ.. అందులో కొన్ని జంటలు ఏకాంతంగా గడుపుతున్నాయి. పట్టపగలే వారంతా ఏకాంతంలో మునిగిపోయారు.. ఈ దృశ్యాలు చూడ్డానికి కూడా ఓయో రూం లో జరుగుతున్నట్టుగానే ఉన్నాయి. దీనికి ఆ నెటిజన్ ఓయో రోడ్డు అని నామకరణం చేశాడు. ఈ వీడియో ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ” ఓయో నిర్వాహకులకు గనక ఈ ఐడియా గనక వచ్చి ఉంటే.. దేశంలో రద్దీగా ఉన్న రోడ్లను కచ్చితంగా లీజుకు తీసుకుంటారు.. తమ కార్యకలాపాలను సాగిస్తారు. దానికి ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తారని” నెటిజన్లు పేర్కొంటున్నారు.