Site icon OkTelugu

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Balakrishna Family Entertainer

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి బాలయ్య క్రింద పడిపోవడం తో ఆయన మోకాళ్ళకు గాయాలు అయ్యాయి. దీంతో తక్షణమే ఆయనకు ప్రధమ చికిత్స ని అందించి హాస్పిటల్ కి తరలించారు. బాలయ్యకి చిన్నపాటి సర్జరీ అవసరమని డాక్టర్లు చెప్పడం తో ఆయన్ని ప్రత్యేక విమానం లో హైదరాబాద్ కి తరలించి , AIG హాస్పిటల్ లో చేర్పించారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత బాలయ్య ని హాస్పిటల్ కి తరలిస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీకోసం చివర్లో అందిస్తున్నాము చూడండి. అయితే కాసేపటి క్రితమే AIG హాస్పిటల్స్ బాలయ్య ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ బులిటెన్ ని విడుదల చేశారు.

వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత , బాలయ్య మొకాలుకి దెబ్బ తగిలి , రక్తం గడ్డ కట్టిందని , సర్జరీ కి ఆయన మోకాలు అనుకూలిస్తుందని , త్వరలోనే విజయవంతంగా పూర్తి చేస్తామని , అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే సర్జరీ తర్వాత బాలయ్య ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కొంతమంది నెల రోజులు అని , మరి కొంతమంది 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. దీనిపై డాక్టర్లు క్లారిటీ ఇవ్వాలి. ఇకపోతే బాలయ్య కి ప్రమాదం జరిగిందనే విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ వంటి వారు కూడా విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్లు వేసిన సంగతి అందరికీ తెలిసిందే .

సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా బాలయ్య ఆరోగ్య పరిస్థితి ని మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ వయస్సు లో కూడా ఇలాంటి సినిమా కోసం ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తున్న బాలయ్య పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్న చిన్న స్తంట్స్ కే డూప్స్ ని వాడుతున్న ఈ రోజుల్లో, 60 ఏళ్ళ వయస్సు లో కూడా సినిమా పట్ల బాలయ్య చూపిస్తున్న డెడికేషన్ కి సెల్యూట్ చేయాల్సిందే . ఆయన త్వరగా కోలుకొని , షూటింగ్ లో పాల్గొని , ఎప్పటి లాగానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు.

Exit mobile version