Mohan Babu High Court rejection : గత కొంతకాలంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో మోహన్ బాబు(Manchu Mohan Babu) యూనివర్సిటీ(Mohanbabu University) గురించి వస్తున్న కథనాలు మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థుల వద్ద ఇష్టమొచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నారని, అలా అక్రమంగా పాతిక కోట్ల రూపాయిల వరకు వసూలు చేశారని, ఆ డబ్బులు మొత్తం తిరిగి విద్యార్థులకు ఇచ్చేయాలంటూ ప్రభుత్వం సైతం ఆర్డర్లు ఇవ్వడం, మోహన్ బాబు యూనివర్సిటీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం, విద్యార్థులు ప్రతీ రోజు ధర్నాలు చేయడం, విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా నిల్చి మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట నిరసన కార్యక్రమాలు చేయడం, ఇలా చాలానే గడిచిన కొద్దిరోజుల నుండి జరుగుతూనే ఉన్నాయి. అయితే విద్యార్థి సంఘాల నాయకులను మోహన్ బాబు బౌన్సర్లు క్డినాప్ చేసి, అతని ఫార్మ్ హౌస్ లో దాచారని , అందుకు సంబంధించిన విజువల్స్ తో సహా కోర్టు కి సమర్పించారు.
అయితే మోహన్ బాబు తనకు అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలని గత కొంతకాలం క్రితం హై కోర్టు కి అప్పీల్ చేసుకున్నాడు. నేడు మోహన్ బాబు అప్పీల్ ని హై కోర్టు విచారించి, ఆయన రిక్వెస్ట్ ని తిరస్కరించింది. అంతే కాకుండా ఫోన్ కాల్స్, మెసేజ్లపై ఫోరెన్సిక్ రిపోర్టు అవకాశమని పేర్కొంటూ విచారణను మార్చి 3 కి వాయిదా వేసింది. అయితే హై కోర్టు ముందస్తు బైలు నిరాకరించడంతో పోలీసులు ఈ కేసు విషయం లో ఒకవేళ మోహన్ బాబు ని విచారణ కోసం రిమాండ్ కి తీసుకెళ్లినా అడిగేవాళ్ళు ఉండరంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణ కు మారుపేరుగా పేరొందిన మోహన్ బాబు, ఇలా రిమాండ్ కి వస్తే రావాల్సి వస్తే ఆయన మనసు చాలా నొచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఆయన విచారణ కి అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత మోహన్ బాబు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో మోహన్ బాబు నాని కి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవ్వగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తో పాటు అజయ్ భూపతి దర్శకత్వం లో రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ , మరియు రాషా తండాని హీరో హీరోయిన్లు గా నటిసున్న ‘శ్రీనివాస మంగపురం’ చిత్రం లో కూడా మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.