
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్ర సివిల్ సప్తైకు రావాలసిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్ ను కోరారు. మరో రెండు నెలలు ఉచిత బియ్యాన్ని పొడిగించినందుకు గోయల్ కు జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఉచిత రేషన్ బియ్యం కింద కేంద్రం ఏపీ పౌరసరఫరాలకు 3,229 కోట్ల బకాయి పడింందని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలంటే బకాయిలు విడుదల అత్యంత అవసరమని జగన్ అన్నారు.