Site icon OkTelugu

India LNG crisis : భారత్‌ త్రిముఖ వ్యూహం.. ఇక ఎల్‌ఎన్‌జీ కొరత తీరినట్లే!

India LNG crisis

India LNG crisis : అధినేతలను మట్టుపెడితే యుద్ధం ముగుస్తుందని అనుకున్న అమెరికా అంచాలు తప్పాయి. ఇరాన్‌ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. 22 రోజులు అయినా ఇరాన్‌ దాడిచేసే సామర్థ్య ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా లాంగ్‌ స్టెల్త్‌ మిస్సైల్‌ను వెలికి తీసింది. దీంతో యుద్ధం మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై తీవ్రమైన దాడలు చేస్తోంది. మరోవైపు ప్రపంచాన్ని ఇంధన కొరత వేధించబోతోంది. చమురు ఉత్పత్తి దేశాలు, రిఫైనరీలపైన ఇరాన్‌ దాడి చేస్తోంది. దీంతో ఇంధనం రవాణా చేసే హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. వందలాది చమురు నౌకలు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. వాటిపైనా దాడి చేస్తోంది. దీంతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. భారత్‌ ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ విషయంలో ఇబ్బంది పడుతోంది.

ఇరాన్‌ ప్రతీకార దాడులు
పది రోజుల్లో యుద్ధం ముగుస్తుందని ట్రంప్‌ భావించారు. కానీ ఇరాన్‌ దాడి సామర్థ్యాన్ని కాపాడుకుంది. గల్ఫ్‌ రిఫైనరీలు, ఓడరేవులపై దాడులు చేసి చమురు రవాణాను అడ్డుకుంది. వందల చమురు నౌకలు హార్మూజ్‌లో చిక్కుకున్నాయి. ఇరాన్‌ ఇంధన ధరలను ఆకాశారోహణకు తీసుకెళ్లి ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేస్తోంది.

భారత్‌ లో ఎల్‌ఎన్‌జీ కొరత..
ప్రస్తుతం భారత్‌లో చమురు కొరత లేదు. కానీ, ఎల్‌ఎన్‌జీ సమస్య ఏర్పడింది. దీంతో హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ఎల్‌ఎన్‌జీ సమస్య పరిష్కరించేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. భారత్‌కు 49% ఎల్‌ఎన్‌జీ ఖతార్‌ నుంచి వస్తుంది. 65% హార్మూజ్‌ మార్గంలో రవాణా అవుతుంది. దీంతో ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ కొరత పెరిగింది. 22 ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు చిక్కుకున్నాయి. దీనికి పరిష్కారంగా భారత్‌ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, నైజీరియా, రష్యా, నార్వే నుంచి దిగుమతులు పెంచుతోంది.

ప్రత్యామ్నాయ మార్గాలు..
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా నుంచి ఎల్‌ఎన్‌జీ తెచ్చే నౌకలు హార్మూజ్‌తో సంబంధం లేకుండా కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ గుండా భారత్‌కు చేరుకుంటాయి. ఇక రషా, నార్వే నుంచి వచ్చే నౌకలు సూయజ్‌ కాలువ మీదుగా వస్తాయి.

శ్వాప్‌ టెండర్లు..
గ్యాస్‌ సమస్య వేగంగా పరిష్కరించేందుకు శ్వాప్‌ టెండర్‌ విధానం అనుసరిస్తోంది. మేరిలాండ్, ఓసియానాల్లో భారత కంటైనర్లు అక్కడే ఉంచి అవసరమైన దేశాలకు ఇస్తుంది. ఇక మన దేశానికి సమీపంలో ఉన్న ఇతర దేశాల కంటెయినర్లను భారత్‌ వినియోగించుకుంటుంది. ఇందుకోసం రూ.600 కోట్లు కేటాయించారు. ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు పెంచుతున్నారు. హార్మూజ్‌లో చిక్కుకున్న 22 నౌకలను భారత్‌కు సురక్షితంగా రప్పించేలా ఏర్పాట్లు చేస్తోంది.

హార్మూజ్‌ మూసివేత దీర్ఘకాలం కొనసాగితే భారత్‌ ఆర్థిక భారం పెరుగుతుంది. శ్వాప్‌ టెండర్లు, విదేశ టెర్మినల్స్‌ లీజు తీసుకోవడం ద్వారా కొరతను తగ్గిస్తున్నారు. శ్రీలంక, పాకిస్తాన్‌ లాంటి సంక్షోభాలు భారత్‌కు రాకుండా ఏర్పాట్లు చేస్తోంది.

 

Exit mobile version