
దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ఇవాళ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందే విధంగా కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్ టెండర్లు వేయాలని కూడా ఆ తీర్మానంలో కోరారు. దేశంలో ఓ రాష్ట్ర అసెంబ్లీ ఇలా తీర్మానం పాస్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ప్రమాదకమైన అంటువ్యాధులను నియంత్రించేందుకు జాతీయ వ్యాక్సిన్ విధానం ఉండేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.