
కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు చనిపోయారు. విశాఖ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1984లో జడ్పీ చైర్మన్ గా టీడీపీ తరపున రామరావు సేవలందించారు. అలాగే 1994, 2004లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపోందారు. 2012-17 వరకు ఎమ్మెల్సీగా బొడ్డు భాస్కర రామారావు పనిచేశారు.