Site icon OkTelugu

ప్రముఖ హాస్య నటుడు పాండు.. కరోనాతో కన్నుమూత

తమిళనాడు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు వివేక్, ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మరణాలను మరిచిపోక ముందే మరో కమెడియన్ సీనియర్ నటుడు పాండు (74) కరోనాతో గురువారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయన తదుపరి చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కుముద, కుమారులు ప్రభు, పంచు, పింటు ఉన్నారు.

Exit mobile version