
హైకోర్టులో మాజీమంత్రి దేవినేని ఉమా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి. కొండూరు పోలీస్ స్టేషన్ లో దాఖలైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుట్ర, ఎస్సీచ ఎస్టీ అట్రాసిటీ, హత్యయత్నం కేసులను పోలీసులు మోపారు. ఈ సెక్షన్లకు ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాదులు పేర్కొన్నారు. ఉమా పైనే దాడి చేసి ఆయనపై కేసులు నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపారు. బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం అడ్మిట్ చేసుకుంది.