
ఐపీఎల్ 14వ సీజన్ లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా టాస్ గెలిచిన డిల్లీ క్యాపిటల్స్ ఫీల్టింగ్ ఎంచుకుంది. కాగా సీజన్ లో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద కనిపించిన ఆర్సీబీ సీఎస్ కే తో జరిగిన ఐదో మ్యాచ్ లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. అటు ఢిల్లీ కూడా ఎస్ ఆర్ హెచ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది.