Site icon OkTelugu

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 16 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,456కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2493 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Exit mobile version