Site icon OkTelugu

బ్రేకింగ్: ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

Revanth Reddy

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

తాజాగా మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తరుఫున రేవంత్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలోనే వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

Exit mobile version