
దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని కరోనా పాజిటివిటీ, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. 12 రాష్టాలు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్ గడ్, పశ్చిమ బెంగాల్, బీహర్, హర్యానా రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్ చేసులు ఉన్నాయి. 50 వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు 7 రాష్ట్రల్లో ఉన్నాయని తెలిపారు. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలు 17 ఉన్నాయని తెలిపారు.