Site icon OkTelugu

తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు

విశాఖలోని సాగర్ నగర్ తీరానికి శనివారం భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. ఈ తరహా తాబేలు సాగర జలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే సమయంలో వలలో చిక్కుకుని పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మరణిస్తుంటాయని పేర్కొన్నారు.

Exit mobile version