
తెలుగు అకాడమి పేరులో మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చోటు కల్పించారు. అతడికి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.